AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj With Flipkart: ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టిన బజాజ్ కంపెనీ.. ఇకపై ఆన్‌లైన్‌లో కూడా బైక్స్ ఆర్డర్ షురూ

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈ-కామర్స్ సైట్స్ ద్వారా అమ్మకాలు బాగా పెరిగాయి. ఈ-కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక ఆఫర్లతో సేల్స్ డేస్‌ను నిర్వహించడంతో వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. తాజాగా ప్రముఖ కంపెనీ అయిన బజాజ్ ఆటో భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి పనిచేసినట్లు ప్రకటించింది.

Bajaj With Flipkart: ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టిన బజాజ్ కంపెనీ.. ఇకపై ఆన్‌లైన్‌లో కూడా బైక్స్ ఆర్డర్ షురూ
Bajaj Bikes In Flipkart
Nikhil
|

Updated on: Jul 21, 2024 | 4:00 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈ-కామర్స్ సైట్స్ ద్వారా అమ్మకాలు బాగా పెరిగాయి. ఈ-కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక ఆఫర్లతో సేల్స్ డేస్‌ను నిర్వహించడంతో వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. తాజాగా ప్రముఖ కంపెనీ అయిన బజాజ్ ఆటో భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి పనిచేసినట్లు ప్రకటించింది. ఫలితంగా బజాజ్ మోటార్‌సైకిళ్ల మొత్తం శ్రేణి ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రారంభ దశలో ఈ సదుపాయం భారతదేశంలోని 25 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది, అయితే కంపెనీ క్రమంగా దాని పరిధిని విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బజాజ్ బైక్ ఆన్‌లైన్ డెలివరీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఇకపై వినియోగదారులు ఎలాంటి శ్రమ లేకుండా తక్కువ ధరకే బజాజ్ బైక్స్‌ను అందిస్తామని ప్రకటించింది. అయితే ఆన్‌లైన్ విక్రయాలను పెంచేందుకు బజాజ్ ఇప్పటికే ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రూ.5,000 తక్షణ తగ్గింపుతో పాటు 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ, బ్యాంకు కార్డుల ఆఫర్లను అందిస్తుంది. 

బజాజ్ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో భారతదేశంలో వివిధ రకాల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీతో నడిచే మోటార్‌సైకిల్ ఫ్రీడమ్‌ను ఇటీవల బజాజ్ విడుదల చేసింది. బజాజ్ లైనప్‌లోని ఇతర బైక్‌లలో ప్లాటినా 100 నుంచి డొమినార్ 400, పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ వంటి పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లు వంటి సరసమైన ధరలక ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. అలాగే బజాజ్ కంపెనీకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫ్లిప్ కార్ట్‌లో విక్రయించనుంది. ప్రస్తుతం ఈ-చేతక్ ధరలు రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..