AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఇంట్లోనే వెల్వేట్‌ పెన్సిల్స్‌ తయారీ.. వేలల్లో ఆదాయం, నష్టం లేని వ్యాపారం.

కాలంతో సంబంధం లేకుండా నిత్యం డిమాండ్‌ ఉండే ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. పెన్సిల్స్‌ వాడకం కాలంతో సంబంధం లేకుండా ఉంటుంది. స్కూలుకు వెళ్లే చిన్నారుల నుంచి ఆఫీసుల్లో ఉండే వారికి వరకూ ప్రతీ ఒక్కరూ పెన్సిల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పెన్సిల్స్‌లో తయారీలో కాలంతో పాటు ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి....

Business Idea: ఇంట్లోనే వెల్వేట్‌ పెన్సిల్స్‌ తయారీ.. వేలల్లో ఆదాయం, నష్టం లేని వ్యాపారం.
Business Idea
Narender Vaitla
|

Updated on: Jul 21, 2024 | 3:28 PM

Share

మారిన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆదాయ మార్గాలను సైతం పెంచుకోవాల్సి పరిస్థితి ఉంది. దీంత చాలా మంది సైడ్ ఇన్‌కమ్‌ కోసం చూస్తున్నారు. దీంట్లో వ్యాపారానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇంట్లోనే ఉంటూ చేసుకునే వ్యాపారాల కోసం ప్లాన్‌ చేస్తున్నారు. అయితే మనలో చాలా మంది వ్యాపారం అనగానే పెట్టుబడి, లాభనష్టాల గురించి వెనకాముందు అవుతుంటారు. అయితే కొన్ని రకాల వ్యాపారాలను తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. అంతేనా మంచి లాభాలను కూడా ఆర్జించవచ్చు.

కాలంతో సంబంధం లేకుండా నిత్యం డిమాండ్‌ ఉండే ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. పెన్సిల్స్‌ వాడకం కాలంతో సంబంధం లేకుండా ఉంటుంది. స్కూలుకు వెళ్లే చిన్నారుల నుంచి ఆఫీసుల్లో ఉండే వారికి వరకూ ప్రతీ ఒక్కరూ పెన్సిల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పెన్సిల్స్‌లో తయారీలో కాలంతో పాటు ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి. తాజాగా వెల్వెట్‌ పెన్సిల్స్‌కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. వీటిని ఇంట్లోనే తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ పెన్సిల్స్‌ను ఎలా తయారు చేయాలి.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వెల్వెట్ పెన్సిళ్ల తయారీకి ఒక మిషన్‌ కావాల్సి ఉంటుంది. అలాగే ముడి సరుకు కూడా అవసరపడుతుంది. వెల్వెట్ పెన్సిల్ తయారీ మిషన్‌ ధర సుమారు రూ. లక్షపైనే ఉంటుంది. దీంతో పాటు ఎలాంటి కలర్‌ లేని పెన్సిల్స్‌ అలాగే గమ్‌, ఒక క్యూబ్‌ అవసర పడుతుంది వీటితో పాటు పెన్సిల్స్‌కు అప్లై చేయడానికి కలర్‌ కూడా కావాలి. వీటన్నింటినీ మార్కెట్‌లో పలు సంస్థలు అందిస్తున్నాయి. ఇక తయారీ విషయానికొస్తే ముందుగా క్యూబ్‌ తీసుకొని దానికి నాలుగు పెన్సిల్స్‌ను అమర్చాల్సి ఉంటుంది. అనంతరం ఒక మిషిన్‌లో కలర్‌ పౌడర్‌ను పోసి ఈ నాలుగు పెన్సిల్స్‌ను అందులో పెట్టాలి.

అనంతరం మిషిన్‌ను ఆన్‌ చేయగానే కలర్‌ మొత్తం పెన్సిల్‌కు అంటుకుంటుంది. వీటిని పక్కన పెట్టి కలర్‌ ఆరేంత వరకు ఉంచాలి. అనంతరం వీటిని మీ సొంత బ్రాండింగ్‌తో మార్కెట్ చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో బౌ బ్యాక్‌ పేరుతో కూడా కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇలాంటి సంస్థలకు డబ్బులు చెల్లించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం బెటర్‌.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!