POTD vs Bank FD: ఆ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడితో రాబడి వరద.. ఎఫ్‌డీలకంటే మెరుగైన లాభాలు

భారతదేశంలోని ప్రజలు పెట్టుబడివైపు ప్రోత్సహించేలా వివిధ పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది ప్రజలు తమ పెట్టుబడికి రిస్క్ లేని రాబడి ఎంచుకుంటారు. రాబడి ఎంత ఉన్నా పర్లేదు కానీ పెట్టుబడి నష్టపోకూడదని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఎంపికగా మారాయి. నమ్మకమైన రాబడితో పెట్టుబడి భద్రత ఉంటుందని చాలాా మంది ప్రజలు ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు.

POTD vs Bank FD: ఆ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడితో రాబడి వరద.. ఎఫ్‌డీలకంటే మెరుగైన లాభాలు
Money Horoscope
Follow us

|

Updated on: Jul 21, 2024 | 3:30 PM

భారతదేశంలోని ప్రజలు పెట్టుబడివైపు ప్రోత్సహించేలా వివిధ పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది ప్రజలు తమ పెట్టుబడికి రిస్క్ లేని రాబడి ఎంచుకుంటారు. రాబడి ఎంత ఉన్నా పర్లేదు కానీ పెట్టుబడి నష్టపోకూడదని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఎంపికగా మారాయి. నమ్మకమైన రాబడితో పెట్టుబడి భద్రత ఉంటుందని చాలాా మంది ప్రజలు ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంక్ ఎఫ్‌డీ కంటే ఎక్కువ వడ్డీని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. హామీతో కూడిన రాబడితో ఈ పథకంలో ఎలాంటి ప్రమాదం ఉండదు. బ్యాంక్ ఎఫ్‌డీ కంటే పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ రాబడి ఎలా ఉంటుందో? ఓసారి తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌

పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడితో ఎలాంటి ప్రమాదం ఉండు. ఇది హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. ప్రస్తుతం, పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ ఐదేళ్ల కాలానికి 7.5 శాతం వడ్డీ  అందిస్తుంది. ఈ పథకం పెట్టుబడిదారులందరికీ ఒకే విధమైన వడ్డీ రేటును కలిగి ఉంది, అంటే సీనియర్ సిటిజన్లకు కూడా 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే వడ్డీ వార్షికంగా చెల్లిస్తారు. అయితే వడ్డీ గణన మాత్రం ప్రతి త్రైమాసికంలో ఉంటుంది. మీరు ఈ పథకాన్ని నిర్ణీత సమయానికి ముందే మూసివేసే అవకాశం ఉంటుంది. అయితే మీరు నిర్ణీత సమయానికి ముందే వడ్డీని ఉపసంహరించుకుంటే, మీకు తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. మీరు ఐదేళ్ల పథకంలో 4 సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకుంటే మీకు 4 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. 

బ్యాంకుల ఎఫ్‌డీలు

బ్యాంక్ ఎఫ్‌డీకు సంబంధించిన వడ్డీ రేటు ప్రతి బ్యాంకుకు భిన్నంగా ఉంటుంది. ఇది కాకుండా బ్యాంక్ ఎఫ్‌డీలో సీనియర్ సిటిజన్‌లు, సూపర్ సీనియర్ సిటిజన్‌ల రేట్లు భిన్నంగా ఉంటాయి. దేశంలోని చాలా పెద్ద బ్యాంకులు ఐదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీని అందిస్తున్నాయి.అయితే సీనియర్ సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం నుంచి 8 శాతం వరకూ అందిస్తారు. దీన్ని బట్టి సాధారణ పెట్టుబడిదారులు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..