Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio: జియో సరికొత్త రికార్డ్‌.. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ..

డేటా వినియోగంలో జియో ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ కంపెనీగా అవతరిచింది. ఎంతలా అంటే జియో డేటా వినియోగం ఏకంగా 4400 కోట్ల జీబీని మించిపోయింది. గతేడాదితో పోల్చితే ఇది ఏకంగా 33 శాతం అధికం కావడం గమనార్హం. చైనాకు చెందిన బడా కంపెనీలను సైతం జియో వెనక్కి నెట్టడం గమనార్హం. రిలయన్స్‌ జియో తాజాగా వెల్లడించిన జూన్‌ త్రైమాసిక గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడించింది...

Jio: జియో సరికొత్త రికార్డ్‌.. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ..
Jio Record
Narender Vaitla
|

Updated on: Jul 21, 2024 | 2:47 PM

Share

టెలికం రంగంలో జియో సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు ఇంటర్నెట్‌ డేటాను ఆచితూచి ఉపయోగించిన యూజర్లు జియో రాకతో ఎడాపెడా వాడేయడం మొదలు పెట్టారు. తక్కువ ధరకే డేటా అందుబాటులోకి రావడంతో చాలా మంది జియో యూజర్లుగా మారారు. దేశంలో అత్యంత త్వరగా ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు సంపాదించుకున్న సంస్థగా జియో రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా జియో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

డేటా వినియోగంలో జియో ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ కంపెనీగా అవతరిచింది. ఎంతలా అంటే జియో డేటా వినియోగం ఏకంగా 4400 కోట్ల జీబీని మించిపోయింది. గతేడాదితో పోల్చితే ఇది ఏకంగా 33 శాతం అధికం కావడం గమనార్హం. చైనాకు చెందిన బడా కంపెనీలను సైతం జియో వెనక్కి నెట్టడం గమనార్హం. రిలయన్స్‌ జియో తాజాగా వెల్లడించిన జూన్‌ త్రైమాసిక గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడించింది. దేశంలోని మొబైల్ యూజర్లలో సగటును రోజుకు 1 జీబీ కంటే ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్న ఏకైక కంపెనీగా జియో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

మరీ ముఖ్యంగా జియో యూజర్లు 5జీ డేటాను విరివిగా ఉపయోగిస్తున్నారు. పెద్ద మొత్తంలో 5జీ డేటా ఉపయోగిస్తున్న జియో కసమర్ల సంఖ్య ఏకంగా 13 కోట్లకు చేరడం విశేషం. ప్రస్తుతం జియో 5జీకి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. కొందరు యూజర్లకు 4జీ డేటాతోనే అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తోంది. ప్రస్తుతం జియోకు భారత్‌లో 49 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. గడిచిన ఒక్క ఏడాదిలోనే జియోకు 4 కోట్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరడం విశేషం.

ఇదిలా ఉంటే కేవలం మొబైల్ యూజర్లే కాకుండా వైర్‌లెస్‌ ఇంటర్నెట్ పరంగా కూడా జియో రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం సుమారు 10 లక్షలకు పైఆ ఇళ్‌లలో ఎయిర్‌ ఫైబర్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ రికార్డు సాధించిన తొలి టెలికాం కంపెనీ కూడా జియోనే కావడం విశేషం. ఇంటర్నెట్‌తో పాటు, జియో వినియోగదారులు వాయిస్ కాలింగ్‌లో కూడా ముందున్నారు. జూన్ త్రైమాసికంలో వాయిస్ కాలింగ్ విషయంలో కంపెనీ 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఇప్పుడు రికార్డు స్థాయి 1.42 ట్రిలియన్ నిమిషాలకు చేరుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..