India Forex Reserves: భారత్‌లో గరిష్ట స్థాయికి విదేశీ మారకం నిల్వలు.. అదే దారిలో బంగారం కూడా..!

దేశ ఆర్థిక స్థితి అనేది ఆయా దేశం వద్ద ఉన్న విదేశి మారక నిల్వల ఆధారంగా ఉంటుంది. దీంతో అన్ని దేశాలు విదేశీ మారక నిల్వల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. భారతదేశం విషయంలో ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూలై 12తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 9.699 బిలియన్ల యూఎస్‌ డాలర్లకు పెరిగాయి

India Forex Reserves: భారత్‌లో గరిష్ట స్థాయికి విదేశీ మారకం నిల్వలు.. అదే దారిలో బంగారం కూడా..!
India Forex Reserves
Follow us

|

Updated on: Jul 21, 2024 | 3:02 PM

దేశ ఆర్థిక స్థితి అనేది ఆయా దేశం వద్ద ఉన్న విదేశి మారక నిల్వల ఆధారంగా ఉంటుంది. దీంతో అన్ని దేశాలు విదేశీ మారక నిల్వల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. భారతదేశం విషయంలో ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూలై 12తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 9.699 బిలియన్ల యూఎస్‌ డాలర్లకు పెరిగాయి. ఇది 666.854 బిలియన్ల యూఎస్‌ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. గత వారంలో ఈ నిల్వలు 5.158 బిలియన్ల యూఎస్‌ డాలర్లుగా ఉన్నాయి. జూన్ 7తో ముగిసిన వారంలో నమోదు చేసిన 655.817 బిలియన్ల యూఎస్‌ డాలర్ల గరిష్ట స్థాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో విదేశీ మారక నిల్వల విషయంలో మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

జూలై 12తో ముగిసిన వారానికి విదేశీ కరెన్సీ ఆస్తులు నిల్వలలో అతిపెద్ద భాగం 8.361 బిలియన్ల డాలర్లకు పెరిగి 585.47 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. డాలర్ పరంగా వ్యక్తీకరించిన ఈ ఆస్తులు రిజర్వ్‌లలో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి యూఎస్‌యేతర కరెన్సీల విలువ లేదా తరుగుదల ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి.

బంగారం నిల్వలు ఇలా

బంగారం నిల్వలు కూడా 1.231 బిలియన్ల యూఎస్‌ డాలర్లకు పెరిగాయి. అంటే మొత్తం 58.663 బిలియన్ల యూఎస్‌ డాలర్లుగా ఉన్నాయి. అదనంగా ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు 76 మిలియన్ల యూఎస్ డాలర్లు పెరిగి 18.111 బిలియన్ల యూఎస్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తో భారతదేశానికి సంబంధించిన రిజర్వ్ స్థానం 32 మిలియన్ల యూఎస్ డాలర్లకు పెరిగి 4.609 బిలియన్ల యూఎస్ డాలర్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారత్‌లో గరిష్ట స్థాయికి విదేశీ మారకం నిల్వలు.. అదే దారిలో బంగారం
భారత్‌లో గరిష్ట స్థాయికి విదేశీ మారకం నిల్వలు.. అదే దారిలో బంగారం
ఫ్రాంచైజీలతోపాటు ఆటగాళ్లకూ గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
ఫ్రాంచైజీలతోపాటు ఆటగాళ్లకూ గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
ఇష్టమొచ్చినట్లు తిట్టారు.. చేతబడి చేశానన్నారు.. హీరోయిన్..
ఇష్టమొచ్చినట్లు తిట్టారు.. చేతబడి చేశానన్నారు.. హీరోయిన్..
నాని సినిమాలో జాన్వీ కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్‌ను అనుకున్నారట
నాని సినిమాలో జాన్వీ కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్‌ను అనుకున్నారట
షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్
షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్
జియో సరికొత్త రికార్డ్‌.. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ..
జియో సరికొత్త రికార్డ్‌.. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ..
సౌందర్య చీర కలర్ చేంజ్ గురించి అసలు సీక్రెట్ చెప్పిన కృష్ణవంశీ..
సౌందర్య చీర కలర్ చేంజ్ గురించి అసలు సీక్రెట్ చెప్పిన కృష్ణవంశీ..
ల్యాప్‌టాప్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్‌ సేల్‌లో భారీ ఆఫర్
ల్యాప్‌టాప్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్‌ సేల్‌లో భారీ ఆఫర్
లక్నోకు గుడ్‌బై చెప్పిన కేఎల్ రాహుల్.. ఖర్చీఫ్ వేసిన ఆర్‌సీబీ
లక్నోకు గుడ్‌బై చెప్పిన కేఎల్ రాహుల్.. ఖర్చీఫ్ వేసిన ఆర్‌సీబీ
అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్, కిషన్ రెడ్డి
అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్, కిషన్ రెడ్డి