Credit Score: సిబిల్ స్కోర్ తగ్గిందా? క్రెడిట్ కార్డుతో ఈజీగా పెంచుకోవచ్చు.. ఈ టిప్స్ పాటించండి..

కొత్తగా క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్న వారు దానిని ఎలా వాడాలో తెలియక నష్టపోతున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడటం తెలియకపోతే వారి సిబిల్/క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్రెడిట్ స్కోర్ ను మెరుగు పరచాలంటే క్రెడిట్ కార్డును ఎలా వాడాలి? తెలియాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.

Credit Score: సిబిల్ స్కోర్ తగ్గిందా? క్రెడిట్ కార్డుతో ఈజీగా పెంచుకోవచ్చు.. ఈ టిప్స్ పాటించండి..
Credit Card
Follow us

|

Updated on: Jul 21, 2024 | 3:47 PM

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. బ్యాంక్లు, ఫైనాన్స్ సంస్థలు క్రెడిట్ కార్డు జారీ విధానంలో నిబంధనలు సడలించడం కూడా ఎక్కువ శాతం మంది వీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. అందులో ఉండే ప్రయోజనాల కారణంగా ఎక్కువ మంది వీటిని విరివిగా వాడుతున్నారు. దానిలో బిల్లలు చెల్లింపు విధానం, క్యాష్ బ్యాక్లు, రివార్డుల వంటివన్నీ అదనపు ప్రయోజనాలు అందిచేవే కావడంతో వీటికి డిమాండ్ కూడా మార్కెట్లో బాగా పెరిగింది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో బయట అప్పులు చేయకుండా క్రెడిట్ కార్డు ఉంటే వాటి ద్వారా ఆ అవసరాలు తీర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. సాధారణంగా క్రెడిట్ కార్డులను ఆన్ లైన్/ఆఫ్ లైన్ షాపింగ్, టికెట్ల బుకింగ్, బిల్లుల చెల్లింపుల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే కొత్తగా క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్న వారు దానిని ఎలా వాడాలో తెలియక నష్టపోతున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడటం తెలియకపోతే వారి సిబిల్/క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్రెడిట్ స్కోర్ ను మెరుగు పరచాలంటే క్రెడిట్ కార్డును ఎలా వాడాలి? తెలియాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.

క్రెడిర్ కార్డ్ బిల్లు చెల్లింపు.. మీ క్రెడిట్ స్కోర్ మెరుగవ్వాలంటే మొదటిగా మీరు చేయాల్సింది.. మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో, పూర్తిగా చెల్లించడం. మినమమ్ డ్యూ కాకుండా మొత్తం చెల్లించాలి. అది కూడా క్రెడిట్-ఫ్రీ వ్యవధిలో చెల్లించడం వల్ల మీ వడ్డీ చెల్లింపులు తగ్గడమే కాకుండా మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.

క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, రివార్డ్‌లు.. క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉండటం వల్ల వచ్చే అనేక రకాల ప్రయోజనాల్లో రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్, వోచర్‌లు ఉంటాయి. వీటిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక పొదుపులు, మొత్తం ఖర్చు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది.

గరిష్ట పరిమితి.. ప్రతి క్రెడిట్ కార్డులో గరిష్ట పరిమితి ఉంటుంది. అయితే దానిని పూర్తిగా వాడకూడదు. క్రెడిట్ కార్డు లిమిట్ 30 నుంచి 40శాతం వరకూ లిమిట్ ను మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. అది దాటితే మీరు ఎక్కువగా క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్నట్లు క్రెడిట్ రిపోర్టు ఏజెన్సీలు గుర్తించి, మీ క్రెడిట్ స్కోర్ ని తగ్గిస్తాయి. అందుకే మీ క్రెడిట్ స్కోర్ బాగుండాలంటే కార్డుపై ఉన్న లిమిట్ లో 30శాతం వరకూ మాత్రమే వినియోగించడం ఉత్తమం.

క్రెడిట్ నివేదికను ట్రాక్ చేయండి.. మోసపూరిత ఖాతాలు లేదా లావాదేవీలు వంటి లోపాలు అప్పుడప్పుడు మీ కార్డ్‌కి కనెక్ట్ చేయబడవచ్చు. మీరు మీ వార్షిక క్రెడిట్ నివేదికను పరిశీలిస్తే తప్ప ఇవి మీకు తెలియవు. అందుకే మీ క్రెడిట్ నివేదికను అధ్యయనం చేయడం, అర్థం చేసుకోవడం ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..