AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ather 450 Apex: అదిరిపోయే లుక్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు..

ఏథర్ ఎనర్జీ కంపెనీ తన ప్రస్థానం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తవుతోంది. ఈ మైల్ స్టోన్ సందర్భంగా 2024 450 అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మన దేశంలో లాంచ్ చేసింది. ఈ ఏథర్ 450 అపెక్స్ స్కూటర్ 450ఎక్స్ వేరియంట్ ఆధారంగానే రూపొందించింది. అయితే దాని లుక్, డిజైన్, స్టైలింగ్, ఫీచర్లలో కొన్ని అప్ గ్రేడ్ లను తీసుకొచ్చింది.

Ather 450 Apex: అదిరిపోయే లుక్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు..
Ather 450 Apex Electric Scooter
Madhu
| Edited By: |

Updated on: Jan 08, 2024 | 11:29 AM

Share

దేశంలో విద్యుత్ శ్రేణి వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా కంపెనీలు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. సరికొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారైన ఏథర్ ఎనర్జీ ఓ కొత్త వేరియంట్ దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఏథర్ ఎనర్జీ కంపెనీ తన ప్రస్థానం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తవుతోంది. ఈ మైల్ స్టోన్ సందర్భంగా 2024 450 అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మన దేశంలో లాంచ్ చేసింది. ఈ ఏథర్ 450 అపెక్స్ స్కూటర్ 450ఎక్స్ వేరియంట్ ఆధారంగానే రూపొందించింది. అయితే దాని లుక్, డిజైన్, స్టైలింగ్, ఫీచర్లలో కొన్ని అప్ గ్రేడ్ లను తీసుకొచ్చింది. ఇది 1.89లక్షలు(ఎక్స్ షోరూం)నకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ కు ఫేమ్ 2 సబ్సిడీ రాదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఏథర్ 450 అపెక్స్ పవర్ ట్రెయిన్..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో పీఎంఎస్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 7 కేడబ్ల్యూ(9.3 బీహెచ్పీ)ని ఉత్పత్తి చేస్తుంది. 450ఎక్స్ వేరియంట్లో ఇది 6.4(8.5బీహెచ్పీ)గా ఉండేది. గరిష్ట టార్క్ అయితే రెండింటిలోనూ 26ఎన్ఎంగా ఉంది. దీనిలో అదనపు శక్తిని వార్ పీప్లస్(Warp+) మోడ్ ద్వారా పొందుతుంది. 450 ఎక్స్ వేరియంట్లో వార్ పీ మోడ్ మాత్రమే ఉండేది.

ఈ స్కూటర్ గరిష్టంగా 100కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. కేవలం 2.9 సెకండ్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. 450ఎక్స్ వేరియంట్ తో పోల్చితే ప్రారంభ యాక్సెలరేషన్ 13శాతం అదనంగా ఇచ్చారు. అలాగే 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంలో 30శాతం పెరిగింది.

ఇవి కూడా చదవండి

ఏథర్ 450 అపెక్స్ ఫీచర్లు..

దీనిలో ఏథర్ న్యూ మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా రీజెనరేటివ్ బ్రేకింగ్ కి సపోర్టు చేస్తుంది. ఈ బ్రేకింగ్ చాలా సమర్థంగా పనిచేస్తుంది. అంతేకాక దీని రేంజ్ కూడా సింగిల్ చార్జ్ పై 157 కిలోమీటర్ల ఉంటుంది. అదే సమయంలో 450ఎక్స్ లో మాత్రం రేంజ్ 150కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.

ఏథర్ 450 అపెక్స్ స్టైలింగ్..

ఈ స్కూటర్ డైమెన్షన్స్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే ఈ స్కూటర్ ను ప్రత్యేకమైన కలర్ స్కీమ్లో ఆవిష్కించింది. సరికొత్త ఇండియమ్ బ్లూ కలర్ తో పాటు బ్రైట్ ఆరెంజ్ కాంబినేషన్లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాక దీనిలో మరో ప్రత్యేకత ఏంటంటే సైడ్ ప్యానల్స్ పూర్తి ట్రాన్స్ పరెంట్ ఇచ్చారు. దీంతో లోపలి ఛాసస్ అందంగా కనిపిస్తుంది. అలాగే టచ్ స్క్రీన్ డ్యాష్ బోర్డు, కొత్త గ్రాఫిక్స్ ను ఇందులో తీసుకొచ్చారు. ఇక మెకానికల్ అంశాలను పరిశీలిస్తే 45ఎక్స్ మాదిరిగానే ఉంచారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవగా.. 2024 మార్చి నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. ఏథర్ షోరూమ్స్ ఫిబ్రవరి నుంచి ఈ స్కూటర్లు ప్రదర్శనకు వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్