EPF Claim Settlement: పీఎఫ్ సొమ్ము విత్ డ్రా చేస్తున్నారా..? ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో? తెలిస్తే షాకవుతారు
భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి జీవితం కోసం సౌకర్యవంతమైన జీతంతో హాయిగా జీవిస్తారు. అయితే అనుకోని ఖర్చులతో పాటు వైద్య అవసరాలకు చాలా మంది అప్పులు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వారి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఓ దన్నుగా నిలుస్తుంది.
భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి జీవితం కోసం సౌకర్యవంతమైన జీతంతో హాయిగా జీవిస్తారు. అయితే అనుకోని ఖర్చులతో పాటు వైద్య అవసరాలకు చాలా మంది అప్పులు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వారి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఓ దన్నుగా నిలుస్తుంది. ముఖ్యంగా అనుకోని అవసరాలకు మనం పొదుపు చేసిన సొమ్ము సహాయకారిగా ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అంటే ఒక ఉద్యోగి ప్రాథమిక జీతంలో కొంత శాతాన్ని భవిష్యత్ అవసరాలకు పొదుపు చేసే వీలు కల్పిస్తుంది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి తన ప్రాథమిక వేతనంలో 12 శాతం మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. అంతే మొత్తంలో యజమాని కూడా ఉద్యోగి ఖాతాకు పీఎఫ్ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. యజమానికి సంబంధించిన 12 శాతం వాటాలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 3.67 శాతం భవిష్య నిధికి వెళ్తుంది. మరోవైపు ఉద్యోగి మొత్తం సహకారం 12 శాతం భవిష్య నిధికి వెళుతుంది. ఈపీఎఫ్ఓ ప్రధాన లక్ష్యం పదవీ విరమణ తర్వాత సొమ్ము అందించడమైనప్పటికీ కూడా అనుకోని ఖర్చుల నేపథ్యంలో ముందుగానే పీఎఫ్‌లో కొంత భాగాన్ని తీసుకోవచ్చు. అయితే ముందస్తుగా పీఎఫ్ అప్లయ్ చేశాక మన ఖాతాలో జమ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో? ఓసారి తెలుసుకుందాం.
ఉద్యోగం మానేశాక ఉద్యోగి ఈపీఎఫ్ కార్పస్‌లో 100 శాతం ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుంది. అతను కొత్త కంపెనీలో చేరకుండా అరవై రోజులు పూర్తయితే వంద శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సందర్భంలో ఉద్తయోగి తన ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించిన తుది సెటిల్‌మెంట్ కోసం ఈపీఎఫ్ఓ ఫారమ్-19 నింపి సమర్పించాలి. అదేవిధంగా ఈపీఎఫ్‌కు నెల నెలా తన వాటా అందిస్తున్న ఉద్యోగి అయితే కొన్ని షరతులతో తన సేకరించిన పీఎఫ్ కార్పస్‌లో 75 శాతం వరకు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుంది. ఈపీఎఫ్ఓ ప్రకారం ఒక ఈపీఎఫ్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి దరఖాస్తుదారుకు మొత్తాన్ని బదిలీ చేయడానికి దాదాపు 20 రోజులు పడుతుంది. గడువులోపు దరఖాస్తుదారుకు మొత్తం అందకపోతే సబ్‌స్క్రైబర్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి సమస్యను నివేదించవచ్చు. అలాగే ఉద్యోగి ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఈపీఎఫ్ చందాదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉపసంహరణ లేదా బదిలీ క్లెయిమ్‌లను సమర్పించవచ్చు. దరఖాస్తును ఫైల్ చేయడానికి ఎంచుకున్న పద్ధతితో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయడానికి సభ్యులు అనుమతి ఉంటుంది. యూఏఎన్ పోర్టల్‌కి లాగిన్ చేయడం లేదా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయడానికి సులభమైన మార్గం.
పీఎఫ్ విత్ డ్రా చేయడానికి అర్హతలివే
- ఈపీఎఫ్ కార్పస్‌లో 100 శాతం పదవీ విరమణపై క్లెయిమ్ చేయవచ్చు. ముందస్తు పదవీ విరమణ పూర్తి కార్పస్‌ను క్లెయిమ్ చేయడానికి సభ్యునికి అర్హత ఉండదు.
- నిరుద్యోగంతో ఇబ్బంది పడితే సభ్యులు అతని లేదా ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తంలో 75 శాతం క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.
- ఈపీఎఫ్ఓ రెండు నెలలు సంబంధిత ఉద్యోగి ఏ కంపెనీలో చేరపోతే డిపాజిట్‌కు సంబంధించిన 100 శాతం ఉపసంహరణను అనుమతిస్తుంది.
ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ క్లెయిమ్ స్థితి తనిఖీ
సభ్యులు యూఏఎన్ మెంబర్ పోర్టల్ లేదా ఈపీఎఫ్ వెబ్‌సైట్, లేదా ఉమంగ్ యాప్ ద్వారా క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి