PF Withdrawal : పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..! అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..
PF Withdrawal : COVID-19 భారతదేశంలో మధ్యతరగతి ప్రజల సేవింగ్స్‌పై పెద్ద దెబ్బకొట్టింది. ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) కార్మికవర్గానికి
PF Withdrawal : COVID-19 భారతదేశంలో మధ్యతరగతి ప్రజల సేవింగ్స్‌పై పెద్ద దెబ్బకొట్టింది. ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) కార్మికవర్గానికి నమ్మదగిన వనరుగా ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. పిఎఫ్ యజమానులు, ఉద్యోగుల నుంచి సమానంగా వచ్చే నిధులను కలిగి ఉంటుంది. ఒక ఉద్యోగి అత్యవసర సమయంలో లేదా ఉద్యోగ విరమణ లేదా రాజీనామా సమయంలో ఖాతా నుంచి కొంత భాగాన్ని ఉపసంహరించుకోవచ్చు.
COVID-19 సంక్షోభం లేదా నిరుద్యోగం సంభవించినప్పుడు డబ్బులో కొంత భాగాన్ని ఉపసంహరించుకునే అవకాశాన్ని EPFO కల్పించింది. అదేవిధంగా వ్యక్తి ఉద్యోగాలను మారిస్తే ఈ మొత్తాన్ని కూడా బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక EPF ఖాతా 8.5% వార్షిక రాబడిని అందిస్తుంది. అయితే మీరు మీ పిఎఫ్ ఖాతా నుంచి డబ్బు ఉపసంహరించుకునేటప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకండి.
1. UAN సీడ్ బ్యాంక్ ఖాతా: UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) బ్యాంక్ ఖాతా నంబర్‌తో తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. పిఎఫ్ ఖాతా లింక్ చేయకపోతే మీరు నిధులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతే కాకుండా ఇపిఎఫ్‌ఓ రికార్డులలో ఇచ్చిన ఐఎఫ్‌ఎస్‌సి నంబర్ ఖచ్చితంగా ఉండాలి.
2. అసంపూర్ణమైన KYC: ఏదైనా అసంపూర్ణమైన KYC ఉంటే మీరు తిరస్కరణను ఎదుర్కొంటారు. KYC సమాచారం ధృవీకరించాలి. మీ సభ్యుల ఇ-సేవా ఖాతాకు లాగిన్ అయితే KYC పూర్తయిందా లేదా అనేది తెలుస్తుంది.
3. తప్పు పుట్టిన తేదీ (DoB): EPFO లో నమోదు చేసిన పుట్టిన తేదీ (DoB), యజమాని రికార్డులో నమోదు చేసిన పుట్టిన తేదీ సరిపోలకపోతే మీ అభ్యర్థన తిరస్కరించబడవచ్చు.
4. యుఎఎన్-ఆధార్ లింక్: యుఎఎన్‌ను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి. మీ UAN ఆధార్‌తో కనెక్ట్ కాకపోతే మీ EPF ఉపసంహరణ అభ్యర్థన తిరస్కరిస్తారు.
5. సరికాని బ్యాంక్ ఖాతా సమాచారం: సరైన బ్యాంక్ ఖాతా వివరాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఖాతా సమాచారాన్ని సరిగ్గా నింపేలా చూసుకోండి.