Sovereign Gold: సావరిన్ గోల్డ్ బాండ్లను కొనాలని అనుకుంటున్నారా.. ఇష్యూ ధర, డిస్కౌంట్, ప్రయోజనాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Sovereign Gold Bond Scheme: సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కామ్ చందా కోసం ఈ రోజు తెరుచుకుంది. సావ‌రిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధ‌ర‌ను ఒక గ్రాముకు రూ. 4,807గా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణ‌యించింది. ఈ సావ‌రిన్ బంగారు బాండ్లపై..

Sovereign Gold: సావరిన్ గోల్డ్ బాండ్లను కొనాలని అనుకుంటున్నారా.. ఇష్యూ ధర, డిస్కౌంట్, ప్రయోజనాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Sovereign Gold Bond Scheme
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 12, 2021 | 9:51 PM

సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కామ్ చందా కోసం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. సావ‌రిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధ‌ర‌ను ఒక గ్రాముకు రూ. 4,807గా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణ‌యించింది. ఈ సావ‌రిన్ బంగారు బాండ్లపై మెచ్యూరిటీ త‌ర్వాత మూల‌ధ‌న లాభాల‌పై ఎలాంటి ట్యాక్స్ ఉండ‌దు. సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కం 2015లో ప్రారంభించిన‌ప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల‌కు పైగా ప్రజల నుంచి పెట్టుబడుల రూపంలో తీసుకుంది. ఈ ఆర్ధిక ఏడాది సావ‌రిన్ గోల్డ్ బాండ్ 4వ భాగం ఈ రోజు చందా కోసం ప్రారంభ‌మైంది. ఇష్యూ ధ‌ర గ్రాము బంగారానికి రూ. 4,807గా నిర్ణ‌యించ‌గా, ఆన్‌లైన్‌లో ధ‌ర‌ఖాస్తు చేసుకుని పెట్టుబ‌డి పెట్టేవారికి గ్రాముకి రూ. 50 త‌గ్గింపు ల‌భిస్తుంది.

మే 31వ తేదీ నుంచి జూన్ 4వ‌ర‌కు అమ‌ల్లో ఉన్న మూడ‌వ విడ‌త స్కీమ్ ధ‌ర గ్రాముకు రూ.4,889గా ఉంది. దీంతోపాటు గ్రాముకు రూ. 50 త‌గ్గింపు ఆఫ‌ర్‌ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. గోల్డ్ బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుని డిజిట‌ల్ విధానంలో చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ. 50 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇప్పుడు గ్రాముకు 4,757 రూపాయ‌లు చెల్లిస్తే స‌రిపోతుంది.

ఈ సంవత్సరం మే నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్యకాంలో ఆరువిడ‌తలుగా ఈ స్కీమ్ కింద గోల్డ్ బాండ్లను జారీ చేయాల‌ని కేంద్ర సర్కార్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా నాలుగో విడ‌త గోల్డ్‌ బాండ్ల జారీకి ఏర్పాట్లు చేసింది. జులై 12 నుంచి 16 వ‌ర‌కు, ఐదు రోజుల‌పాటు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ధ‌ర గ్రాముకు రూ.4,807గా ఉంటుందని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేష‌న్ వెల్లడించింది.

కాగా, కాంట్రిబూషన్‌కు ముందు వారం.. చివ‌రి మూడు రోజుల్లో 999 ప్యూరిటీ ప‌సిడి ధ‌ర ముగింపు స‌గ‌టు ప్రాతిప‌దిక‌న ఇష్యూ ధ‌ర నిర్ణయించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పేర్కొంది. జూలై 7, 8, 9 తేదీల్లో బంగారం ధ‌ర స‌గ‌టును అనుస‌రించి గ్రాము రేటును నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడి పెట్టేవారు..

అయితే గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్‌ ఎక్స్ఛేంజిలలో వాటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. గోల్డ్ బాండ్ల కాల‌ప‌రిమితి 8 ఏళ్లు. అయితే అత్యవసరం అనుకుంటే ఐదేళ్ళ త‌రువాత ఈ బాండ్లను అమ్ముకోవ‌చ్చు. గోల్డ్‌ బాండ్లపై వడ్డీ కూడా వస్తుంది.

సావ‌రిన్ గోల్డ్ బాండ్….

  •  డిజిట‌ల్,పేప‌ర్ గోల్డ్ ద్వారా భౌతిక ర‌హిత బంగారంపై పెట్టుబ‌డి పెరుగుతుంది. గ‌త కొన్ని వారాలుగా బంగారం ధ‌ర‌ల‌లో ధృఢ‌త్వం కార‌ణంగా అధిక ఆస‌క్తి ఉంది.
  • 2015లో ఈ ప‌థ‌కం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి 2021 మార్చి చివ‌రి వ‌ర‌కు సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కం ద్వారా మొత్తం రూ. 25,702 కోట్లు సేక‌రించారు.
  • బంగారం దిగుమ‌తులు త‌గ్గించి ఆర్థిక లోటును అదుపు చేయ‌డానికి నిరంత‌రం కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంది.  భౌతిక బంగారు క‌డ్డీలు, నాణేలు కొన‌డం, నిల్వ చేయ‌డం, అమ్మ‌డం వంటి ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వం ఆదా చేస్తోంది.
  • ఇండియా బులియ‌న్ అండ్ జ్యువెల‌ర్స్ అసోసియేష‌న్ లిమిటెడ్ ప్ర‌క‌టించిన 999 స్వ‌చ్ఛ‌త బంగారం ముగింపు స‌గ‌టు ధ‌ర ఆధారంగా చందా కాలానికి ముందు వారంలోని చివ‌రి 3 ప‌ని దినాల‌ ధ‌ర ఆధారం చేసుకుని బాండ్ ధ‌ర భార‌త క‌రెన్సీ రూపాయిల‌లో నిర్ణ‌యించ‌బ‌డింది.
  • ప్రాథమికంగా 1 గ్రాము నుంచి అనేక గుణ‌కాల‌లో బంగారం బాండ్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.
  • 8 సంవ‌త్స‌రాలు బాండ్ పీరియ‌డ్ ఉంటుంది. అయితే 5వ సంవ‌త్స‌రం త‌ర్వాత నిష్క్ర‌మ‌ణ అవ‌కాశం కూడా ఉంటుంది.
  • క‌నీసం అనుమ‌తించ‌ద‌గిన పెట్టుబ‌డి 1 గ్రాము బంగారం. చందా గ‌రిష్ట ప‌రిమితి వ్య‌క్తికి 4 కిలోలు, హెచ్‌యూఎఫ్‌కు 4 కిలోలు మ‌రియు ట్ర‌స్ట్‌ల‌కు 20 కిలోల వ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.
  • ఈ బాండ్స్ ముఖ్య ఉద్దేశం మెటల్ బంగారంకు డిమాండ్‌ను త‌గ్గించ‌డం. దేశీయ పొదుపులో కొంత భాగాన్ని అంటే డైర‌క్ట్‌గా బంగారం లాంటివి కొన‌కుండా, ఆర్థిక పొదుపుగా మార్చాల‌నే టార్గెట్‌తో ఈ ప‌థ‌కాన్ని న‌వంబ‌ర్ 2015లో ప్రారంభించారు.
  •  మెచ్యూరిటి  ధ‌ర అప్ప‌టి బంగారం ధ‌ర‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

ఇవి కూడా చదవండి :  Rajinikanth Returns: తలైవా మళ్లీ వస్తున్నాడు.. రీ ఏంట్రీపై తేల్చేస్తానంటున్న సూపర్ స్టార్

Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..