AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon online: ఆన్‌లైన్ అమ్మకాలకు ప్రపంచ వ్యాప్తంగా అంతరాయం.. ఇండియా సహా వివిధ దేశాల యూజర్ల ఫిర్యాదు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆన్‌లైన్ షాపింగ్‌లో అంతరాయం ఏర్పడింది.

Amazon online: ఆన్‌లైన్ అమ్మకాలకు ప్రపంచ వ్యాప్తంగా అంతరాయం.. ఇండియా సహా వివిధ దేశాల యూజర్ల ఫిర్యాదు
Sanjay Kasula
|

Updated on: Jul 12, 2021 | 3:05 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ సైట్ల అమ్మకాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఇందులో ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌కు ఉంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆన్‌లైన్ షాపింగ్‌లో అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా కస్టమర్‌లు షాపింగ్ చేసేటప్పుడు తాత్కాలికంగా సమస్యలను ఎదుర్కొన్నారు. లాగిన్‌, షాపింగ్‌ సమస్యలు, ప్రైమ్‌ వీడియో సేవలకు అంతరాయం వంటి ఫిర్యాదులతో ట్విటర్‌ నిండిపోయింది. ఇండియాతో పాటు UK, కెనడా, ఫ్రాన్స్ , సింగపూర్‌లోని పలు కస్టమర్లు అమెజాన్‌ డౌన్‌ అంటూ గగ్గోలు పెట్టారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై వినియోగ దారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అమెజాన్‌ స్పందించింది.

ఇబ్బందులు తలెత్తినమాట నిజమేనని, ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కరించామని ప్రకటిచింది అమెజాన్. ప్రస్తుతం అంతా సజావుగా నడుస్తోందని తెలిపింది. అయితే, అంతర్జాలంలో వచ్చిన అంతరాయానికి గల కారణాలను స్పష్టం తెలియలేదని వెల్లడించింది. తర్వాలోనే సమస్యకు గల కారణాలకు కనిపెట్టే పనిలో తమ టెక్నికల్ టీమ్ ఉందని తెలిపింది.

ఇంటర్నెట్‌లో అంతరాయాలను గుర్తించే వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్.కామ్(https://downdetector.com/) ప్రకారం అమెజాన్‌లోని పలు రకాల సేవలు గంటల పాటు ఆగిపోయాయి. 40 మందికి వేలకు పైగా వినియోగదారులు తమ అమెజాన్ ఖాతా స్పందించడం లేదని నివేదించారు. అమెజాన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో కూడా సమస్య లొచ్చాయని ఆరోపించారు. ఫలితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, అలెక్సా సేవలు కూడా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.

ఇవి కూడా చదవండి :  Rajinikanth Returns: తలైవా మళ్లీ వస్తున్నాడు.. రీ ఏంట్రీపై తేల్చేస్తానంటున్న సూపర్ స్టార్

Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..