Bajaj: పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో భయపడుతున్నారా? ఈ బైక్ ట్రై చేయండి, లీటర్‌కు 91 కి.మీలు. రూ. 1292 ఈఎమ్‌ఐతో..
Bajaj CT 100: దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. తాజాగా కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107కి చేరింది. దీంతో వాహనాన్ని బయటకు...
Bajaj CT 100: దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. తాజాగా కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107కి చేరింది. దీంతో వాహనాన్ని బయటకు తీయాలంటేనే భయం వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే చాలా మంది బైక్‌లను పక్కన పెట్టి బస్సుల్లో ప్రయాణిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇలాంటి సమయాల్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ ఉంటే బాగుంటుంది. కదూ.. ఇప్పుడు తెలుసుకోబేయో బైక్ అలాంటిదే. మంచి మైలేజ్ కోరుకునే వారికి బజాబ్ సీటీ 100 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ బైక్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత.? లాంటి వివరాలు మీకోసం..
బజాజ్ సీటీ 100 లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 91 కీలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంటే దీంతో మీరు సుమారు రూపాయికి ఒక కిలోమీటర్ ప్రయాణించవచ్చన్నమాట. ఇక ఈ బైక్ ధర విషయానికొస్తే రూ. 58,198గా ఉంది. అయితే దీనిని మీరు ఫైనాన్స్‌లో తీసుకోవాలనుకుంటే.. రూ. ఆరు వేలు డౌన్ పేమెంట్ చేసి బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఇన్‌స్టాల్‌మెంట్‌లోకి మార్చుకుంటే.. ఉదాహరణకు 60 నెలలకు ఈఎమ్‌ఐ ఎంచుకుంటే మొత్తం రూ. 77,520 చెల్లించాల్సి వస్తుంది. ఇందులో రూ. 25,322 వడ్డీ కింది పోతుంది. ఇక నెలకు కేవలం రూ. 1292 చెల్లిస్తే సరిపోతుంది.
బజాబ్ సీటీ 100 ఫీచర్లు..
ఈ బైక్ ప్రధాన ఫీచర్ దీని మైలేజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లీటర్‌కు 91 కిలోమీటర్లు మైలేజ్‌ని ఇస్తుంది. ఇక ఫ్రంట్ స్పెనక్షన్ ఈ బైక్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. బిఎస్6 వెర్షన్‌తో వస్తోన్న ఈ బైక్‌లో 115.45 ఇంజన్‌ను అందించారు. ఈ బైక్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.31 ఎన్‌ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేయగలదు. ఎలక్ట్రిక్ ఇంజెక్షన్ ఇంజిన్‌తో 4 స్ట్రోక్ గేర్ బాక్స్ అందించారు.
Also Read: Maruti Ertiga : మారుతి ఎర్టిగా అమ్మకాలు 200% పెరుగుదల..! తక్కువ ధరలో ఏడు సీట్ల కారు
Aadhaar Card : ఆధార్ కార్డుతో ఆన్‌లైన్ మోసాలు..! వినియోగదారులను హెచ్చరిస్తున్న UIDAI