Petrol Price: తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్న ఇంధన ధరలు.. హైదారాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 105 దాటేసింది.
Petrol And Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రోజు వారీగా పెరుగుతోన్న ధరలు సామాన్యులను భయపెట్టిస్తున్నాయి. దేశ చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు...
Petrol And Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రోజు వారీగా పెరుగుతోన్న ధరలు సామాన్యులను భయపెట్టిస్తున్నాయి. దేశ చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. మొన్నటి వరకు పెట్రోల్ సెంచరీ కొట్టనుంది అన్న వార్తలు వింటే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ పరిస్థితులు చూస్తుంటే రూ. 150కి చేరుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సోమవారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 105 దాటేసింది. దేశ వ్యాప్తంగా రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
* దేశ రాజధాన్ని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.19 కాగా, డీజిల్ ధర రూ.89.72 వద్ద కొసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రో మంటలు చెలరేగిపోతున్నాయి. ఇక లీటర్ పెట్రోల్ రూ. 107.20 ఉండగా, డీజిల్ రూ. 97.29 వద్ద కొనసాగుతోంది. * దేశంలో అత్యధికంగా జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ. 108.56కు చేరుకుంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 99.34 వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.101.92 కాగా, డీజిల్ రూ. 94.24 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.
* హైదరాబాద్‌లో సోమవారం లీటర్ పెట్రోల్ రూ. 105.15 ఉండగా, డీజిల్ రూ. 97.78గా నమోదైంది. * తెలంగాణలో అత్యధికంగా కొమురం భీమ్ అసీఫాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 107.21కి చేరింది. ఇక్కడ లీటర్ డీజిల్ రూ. 99.69 వద్ద కొనసాగుతోంది. * విజయవాడంలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.43 కాగా, డీజిల్ రూ. 99.49 వద్ద కొనసాగుతోంది. * సాగర నగరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.60 ఉండగా, డీజిల్ ధర రూ. 98.68గా నమోదైంది.
Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. సోమవారం దేశవ్యాప్తంగా తులం గోల్డ్ ఎంతుందంటే..
Google pay: గూగుల్ పే ద్వారా రోజుకు ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చో తెలుసా…