AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Media& Entertainment Week: అభివృద్ధి పథంలో భారత మీడియా, వినోద పరిశ్రమలు: ఐఎంబీ కార్యదర్శి అపూర్వ చంద్ర..

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో భారత మీడియా, వినోద పరిశ్రమ (Media&Entertainment) ఒకటని సమాచార, బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రిత్వ శాఖ (IMB) కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు.

Media& Entertainment Week: అభివృద్ధి పథంలో భారత మీడియా, వినోద పరిశ్రమలు: ఐఎంబీ కార్యదర్శి అపూర్వ చంద్ర..
Basha Shek
|

Updated on: Mar 19, 2022 | 3:31 PM

Share

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో భారత మీడియా, వినోద పరిశ్రమ (Media&Entertainment) ఒకటని సమాచార, బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రిత్వ శాఖ (IMB) కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. 2030 నాటికి ఈ రంగం100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.7.5 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దుబాయ్‌ ఎక్స్‌పో ఇండియా పెవిలియన్‌లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ వీక్‌ను అపూర్వ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భారతదేశంలో మీడియా, వినోద పరిశ్రమలకు అవసరమైన సృజనాత్మక నైపుణ్యాలు, వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ‘ సుమారు 12 శాతం వార్షిక వృద్ధి రేటుతో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న మీడియా పరిశ్రమల్లో భారత్‌ ఒకటి. ప్రస్తుతం మన దేశంలో మీడియా, వినోద పరిశ్రమ విలువ 28 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.10 లక్షల కోట్లు)గా ఉంది. 2030 నాటికి ఈ రంగం100 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరవచ్చు’ అని అపూర్వ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.

నెలాఖరులో ఏవీజీసీ టాస్క్‌ఫోర్స్‌..

కాగా యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ (ఏవీజీసీ) కంటెంట్‌ సృష్టి కోసం వివిధ కంపెనీలు, సంస్థలతో జత కట్టనున్నట్లు అపూర్వ చంద్ర తెలిపారు. ఇందుకోసం ఈ నెలాఖరుకు ఏవీజీసీ టాస్క్‌ఫోర్స్‌ను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు మాధవన్‌, దూరదర్శన్‌ డైరెక్టర్‌ జనరల్‌ మయాంక్‌ అగర్వాల్‌, జాయింట్‌ సెక్రటరీ శ్రీ విక్రమ్‌ సహాయ్‌, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికెషన్‌ (CBFC) సీఈవో రవీందర్‌ భాకర్‌, I&B ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి, రామ్‌చరన్‌, ఎన్టీఆర్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: Thumbura Theertham: ప్రకృతి అందాల నడుమ తుంబుర తీర్ధం.. రెండేళ్ల తర్వాత అనుమతి.. భారీగా పోటెత్తిన భక్తులు

Tirumala Accident: తిరుమలలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. రెండో ఘాట్ రోడ్డులో కారు దగ్ధం.. గరుడ వారధిపై కారు బోల్తా

Schools: ప్రభుత్వం సంచనల నిర్ణయం.. సర్కారు స్కూళ్లలో చదువుకునే బాలికలకు నెలకు వెయ్యి రూపాయలు..