AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New ATM Scam: ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసే వారికి అలెర్ట్.. వెలుగులోకి నయా స్కామ్

మన అకౌంట్ నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకోవడం అనేది ఖాతాదారులకు సులభం అయ్యింది. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉన్నట్లు కొంతమంది మోసగాళ్లు ఖాతాదారులను మోసగించి సొమ్మును తస్కరించేందుకు ఏటీఎం సెంటర్లను కూడా వదడం లేదు. తాజాగా ఏటీఎం కేంద్రాన్ని అడ్డాగా చేసుకుని చేసే నయా మోసం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా స్కామర్లు ఏటీఎం నుంచి నుండి కార్డు రీడర్‌ను ముందుగానే తీసేస్తారు. అందువల్ల కస్టమర్ కార్డ్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించినప్పుడు మెషీన్ లోపల చిక్కుకుపోతుంది. ఇది జరిగిన తర్వాత మోసగాళ్లు కస్టమర్ కోసం వారి పిన్‌ను నమోదు చేయడానికి సహాయం చేస్తున్నట్లు నటిస్తారు.

New ATM Scam: ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసే వారికి అలెర్ట్.. వెలుగులోకి నయా స్కామ్
Atm
Nikhil
|

Updated on: May 05, 2024 | 7:00 AM

Share

భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో ఏటీఎంలు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. ముఖ్యంగా మన అకౌంట్ నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకోవడం అనేది ఖాతాదారులకు సులభం అయ్యింది. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉన్నట్లు కొంతమంది మోసగాళ్లు ఖాతాదారులను మోసగించి సొమ్మును తస్కరించేందుకు ఏటీఎం సెంటర్లను కూడా వదడం లేదు. తాజాగా ఏటీఎం కేంద్రాన్ని అడ్డాగా చేసుకుని చేసే నయా మోసం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా స్కామర్లు ఏటీఎం నుంచి నుండి కార్డు రీడర్‌ను ముందుగానే తీసేస్తారు. అందువల్ల కస్టమర్ కార్డ్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించినప్పుడు మెషీన్ లోపల చిక్కుకుపోతుంది. ఇది జరిగిన తర్వాత మోసగాళ్లు కస్టమర్ కోసం వారి పిన్‌ను నమోదు చేయడానికి సహాయం చేస్తున్నట్లు నటిస్తారు. అయితే పిన్ టైప్ చేసినా పని చేయడం లేదని బాధితుడికి చెప్పి బ్యాంకులో ఫిర్యాదు చేయమని సూచిస్తారు. కస్టమర్ వెళ్లిన తర్వాత స్కామర్లు మెషీన్ నుంచి కార్డును తీసుకుని, బాధితుడి ఖాతా నుండి డబ్బును విత్ డ్రా చేస్తారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్ గురించి మరిన్న వివరాలను తెలుసుకుందాం.

ఇలా మోసాలు చేసే ఏటీఎం మోసగాళ్ల బృందాన్ని ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తులు గతంలో 25 ఇలాంటి కేసుల్లో పాల్గొన్నారని తేలింది. హౌజ్ ఖాన్లోని కియోస్క్ పై దుండగులు కాల్పులు జరిపారు. విశాల్ నేగి (30), అమిత్ మెహ్రా (37), విజయ్ కుమార్ (26)లను నిందితులుగా గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇలాంటి ఘటనల్లో వీరి ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో తదుపరి విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఏటీఎం మోసాల నుంచి రక్షణ ఇలా

  • ఏటీఎంలలో ఉపసంహరణలు చేసేటప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
  • చాలా బ్యాంకులు తమ మొబైల్ యాప్స్ ద్వారా ‘కార్డ్స్ క్యాష్ విత్డ్రాయల్’ ఫీచర్లను అందిస్తాయి. ఇది ఏటీఎంలు లేదా కియోస్క్ వద్ద మీ కార్డ్‌ను ఇన్సర్ట్ చేయకుండా ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • మీరు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని గమనిస్తే దానిని వెంటనే మీ బ్యాంకికి నివేదించడం చాలా ముఖ్యం.
  • మీ కార్డ్ ఏటీఎంలో చిక్కుకుపోయినట్లయితే, కియోస్క్ లావాదేవీని రద్దు చేయాలి. మీ బ్యాంక్ను సంప్రదించండి లేదా మీ కార్డ్ బ్లాక్ చేయడానికి అత్యవసర బ్యాంకింగ్ సేవలను ఉపయోగించాలి.
  • కొన్ని బ్యాంకులు తమ మొబైల్ యాప్ల ద్వారా అదనపు ఫంక్షనాలిటీలను అందిస్తాయి. కస్టమర్లు తమ కార్డులను తాత్కాలికంగా డియాక్టివేట్ చేయడానికి లేదా బ్లాక్ చేయడానికి, వారి పిన్‌ను తక్షణమే మార్చుకోవడానికి వీలు కల్పిస్తాయి.
  • మీ పిన్‌ను ఎప్పుడూ షేర్ చేయకండి మరియు అత్యంత గోప్యతను కాపాడుకోవాలి. ముఖ్యంగా అపరిచితుల సమక్షంలో ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌