Mutual Funds: నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ మ్యూచువల్ ఫండ్ నిబంధనలను సమీక్షించింది. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రోత్సహించే చర్యలను సిఫారసు చేసింది. వాటిని అనుసరించి ఉమ్మడి మ్యూచువల్ ఫండ్ ఖాతా నామినేషన్లను ఆప్షనల్ (తప్పనిసరి కాదు) చేసింది.

Mutual Funds: నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు
Mutual Fund
Follow us

|

Updated on: May 04, 2024 | 6:21 PM

జాయింట్ మ్యూచువల్ ఫండ్ ఖాతాలు కలిగిన వారికి సెబీ శుభవార్త చెప్పింది. వారి ఖాతాలకు సంబంధించి నామినీలను తప్పనిసరిగా నామినేట్ చేయాలనే విషయంపై కొత్త నిర్ణయం తీసుకుంది. నామినీ నిర్ణయం ఖాతాదారుల ఇష్టమని తెలిపింది. తప్పనిసరిగా నామినేట్ చేయాలనే నిబంధనలను తొలగించింది. సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

సెబీ మార్గదర్శకాలు..

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ మ్యూచువల్ ఫండ్ నిబంధనలను సమీక్షించింది. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రోత్సహించే చర్యలను సిఫారసు చేసింది. వాటిని అనుసరించి ఉమ్మడి మ్యూచువల్ ఫండ్ ఖాతా నామినేషన్లను ఆప్షనల్ (తప్పనిసరి కాదు) చేసింది. అలాగే ఫండ్ హౌస్‌లు కమోడిటీ, విదేశీ పెట్టుబడులను పర్యవేక్షించడానికి ఒకే ఫండ్ మేనేజర్‌ని కలిగి ఉండటానికి అనుమతించింది. ఇది ఫండ్ నిర్వహణ ఖర్చును తగ్గిస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు నామినేషన్ అనేది వారి ఇష్టప్రకారం చేసుకోవచ్చని తెలిపింది.

లాభాలు ఇవే..

జాయింట్ హోల్డర్లకు నామినేషన్ విషయంలో సడలింపు ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. జీవించి ఉన్న సభ్యుడిని నామినీగా అనుమతించడం ద్వారా నామినేషన్ ప్రక్రియ సులభతరం అవుతుంది. దీని ద్వారా ఖాతాల నిర్వహణ సులభమవుతుంది. అనుకోకుండా కలిగే అవాంతరాలను తొలగిస్తుంది. జీవించి ఉన్న చివరి సభ్యుడు నామినీని కేటాయించవచ్చు

ఖాతాదారులకు..

ప్రస్తుత వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ హోల్డర్లందరికీ నామినేట్ చేసుకోవడానికి లేదా, నామినేషన్ నుంచి వైదొలగడానికి జూన్ 30 వతేదీ వరకూ అవకాశం ఉంది. అప్పటిలోగా చేసుకోకపోతే ఖాతాలు స్తంభించిపోతాయి.

ఎందుకు అవసరం..

  • దురదృష్టవశాత్తూ వ్యక్తిగత ఖాతాదారుడు మరణించిన సందర్భంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఆయన వారసులకు సజావుగా అందడానికి నామినేషన్ ఉపయోగపడుతుంది.
  • సదరు నామినీ మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను చాలా వేగంగా క్లెయిమ్ చేయవచ్చు. ఇది క్లిష్ట చాలా అవసరమైన ఆర్థిక భద్రత కల్పిస్తుంది.
  • స్పష్టమైన నామినేషన్ మీ మ్యూచువల్ ఫండ్ కు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను తగ్గిస్తుంది.
  • పెట్టుబడి దారుడి మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ కేవైసీ రుజువు వంటి ప్రాథమిక పత్రాలతో పాటు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, సాపేక్షంగా జరుగుతుంది.
  • నామినీ లేకపోతే చట్టపరమైన వారసులు ప్రొబేట్ ప్రక్రియ ద్వారా వెళ్లవలసి ఉంటుంది. ఇది ఎక్కువ సమయం పడుతుంది. కష్టంగానూ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..