AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Voter Check: ఎస్‌ఐఆర్ తర్వాత మీ ఓటు ఉందా..? గల్లంతైందా..? ఒక్క SMSతో ఇట్టే తెలుసుకోండి..

ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగియడంతో ఇందులో పాల్గొనని లక్షలాది ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. దీంతో తమ ఓటు కూడా పోయిందేమోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే మీ ఎస్‌ఐఆర్ స్టేటస్ సులువుగా తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితే మీ ఓటు ఉన్నట్లే లెక్క.

Voter Check: ఎస్‌ఐఆర్ తర్వాత మీ ఓటు ఉందా..? గల్లంతైందా..? ఒక్క SMSతో ఇట్టే తెలుసుకోండి..
Voter List Update
Venkatrao Lella
|

Updated on: Aug 13, 2026 | 1:49 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. ఏపీ, తెలంగాణలో ఈ ప్రక్రియను ఈసీ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ప్రాసెస్‌లో ఎస్‌ఐఆర్‌లో పాల్గొనని లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఎమ్యూనరేషన్ ఫారాలు అందించారు. ఈ ఫారాలను పూర్తి చేసి ఓటర్లు బీఎల్వోకు అందించాల్సి ఉంటుంది. బీఎల్వోలు ఇంటికి వచ్చి వీటిని తీసుకుంటారు. అనంతరం బీఎల్‌వోలు వీటిని ఆన్‌లైన్ చేస్తేనే ఓటర్ల వివరాలు ఈసీ పోర్టల్‌లో అప్డేట్ అవుతాయి. అయితే తమ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందా లేదా అని చాలామంది ఆందోళన పడుతుంటారు. అలాంటివారు ఒక్క ఎస్‌ఎంఎస్‌తో ఎస్‌ఐఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

ఎస్‌ఎంఎస్ ద్వారా ఎస్‌ఐఆర్ స్టేటస్ ఎలా..?

ECI <Space> EPIC Number టైప్ చేసి 1950 నంబర్‌కు మీ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపించాలి. కొన్ని సెకన్లలోనే మీకు ఈసీ నుంచి రిప్లూ వస్తుంది. అందులో మీ పేరు, ఓటర్ కార్డు నెంబర్, నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ పేరు వంటివి వస్తాయి. ఈ వివరాలు వస్తే మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైనట్లు గుర్తించాలి. ఒకవేళ ఎలాంటి వివరాలు అందకపోతే వెంటనే మీ బీఎల్‌ఓను సంప్రదించాలి.

వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలా..?

https://voters.eci.gov.in/enumerationformnew పోర్టల్‌లోకి వెళ్లాలి

-మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి

-మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి

-అనంతరం ఫిల్ ఎన్యూమరేషన్ ఫారం ఆప్షన్ ఎంచుకోవాలి

-ఆ తర్వాత మరోసారి మొబైల్ నెంబర్, క్యాప్చా ఫిల్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి

-అక్కడ మీ స్టేట్, ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేయాలి

-యువర్ ఫారం హాజ్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ అని వస్తే మీ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయినట్లు గుర్తించవచ్చు

-ఒకవేళ పెండింగ్‌లో ఉంటే బీఎల్‌వో పేరు, మొబైల్ నెంబర్ కనిపిస్తుంది.

ఓటు కోల్పోతే ఏం చేయాలి..?

మీరు వేరే ప్రాంతంలో ఉండి ఎస్‌ఐఆర్ పూర్తి చేయకపోతే మీ ఓటు తొలగిస్తారు. ఇలాంటి సమయంలో మళ్లీ కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలి. మీ వివరాలను ఈసీ పరిశీలించి కొత్త ఓటర్ ఐడీ జారీ చేస్తోంది. దీంతో ఎస్ఐఆర్‌లో పాల్గొనకపోత మీ ఓటు పోయినట్లు లెక్క కాదు. మళ్లీ దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందవచ్చు. కానీ మళ్లీ దరఖాస్తు చేసుకుని ఐడీ పొందేందుకు చాలా ఆలస్యం అవుతుంది.

Follow Us