Okaya Disruptor: కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు అయిన ఒకాయకు చెందిన ప్రీమియం బ్రాండ్ ఫెర్రాటో నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ఫెర్రాటో తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దాని ధర రూ. 11,59,999గా ఉంటుంది పేర్కొంది. ఈ కొత్త ఈ-బైక్ పేరు డిస్రప్టర్. దీని ధర ఢిల్లీలో అయితే కేవలం రూ. 1.4లక్షలు మాత్రమే ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Okaya Disruptor: కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
Okaya Disruptor Ev
Follow us

|

Updated on: May 04, 2024 | 5:21 PM

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు అయిన ఒకాయకు చెందిన ప్రీమియం బ్రాండ్ ఫెర్రాటో నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ఫెర్రాటో తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దాని ధర రూ. 11,59,999గా ఉంటుంది పేర్కొంది. ఈ కొత్త ఈ-బైక్ పేరు డిస్రప్టర్. దీని ధర ఢిల్లీ అయితే కేవలం రూ. 1.4లక్షలు మాత్రమే ఉంటుందని కంపెనీ పేర్కొంది. అక్కడ సబ్సిడీ ఎక్కువగా ఉందని వివరించింది. అంతేకాక ఈ బైక్ రన్నింగ్ కాస్ట్ కిలోమీటర్ కు కేవలం రూ. 25పైసలు మాత్రమేనని కంపెనీ ప్రకటించుకుంది. కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించిందని, 90 రోజుల్లో డిలివరీలు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు ప్రకటించింది.

ఫెర్రాటో డిస్రప్టర్ పూర్తి వివరాలు..

ఫెర్రాటో నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం కావడంలో కంపెనీ ప్రెస్టిజీయస్ గా తీసుకుని లాంచింగ్ ను ప్లాన్ చేస్తోంది. ఈ బైక్ సింగిల్ చార్జ్ పై 129కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని పేర్కొంది. పీఎంఎస్ఎం సెంటర్ మోటార్ చైన్ డ్రివెన్ సిస్టమ్ ద్వారా గరిష్టంగా 6.37కేడబ్ల్యూ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 95కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. దీనిలో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఎకో, సిటీ, స్పోర్ట్స్ మోడ్స్ రైడర్స్ కు డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ బైక్ భారతీయ వాతావరణ పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందని. 270 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కూడా అధిక థర్మల్ రన్ అవే ఉంటుందని పేర్కొంది. 3.97కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. ఐపీ67 రేటింగ్ తో వస్తుంది. ఈ బైక్ కి మూడేళ్లు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీతో వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రీ బుకింగ్స్ ప్రారంభం..

కంపెనీ ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. మొదట బుక్ చేసుకొనే 1000 మంది వినియోగదారులకు కంపెనీ స్పెషల్ ఆఫర్ కూడా ప్రకటించింది. కేవలం రూ. 500చెల్లించి బైక్ ని బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రూ. 2,500 టోకెన్ మొత్తం చెల్లించి బైక్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

క్రమంగా పెరుగుతున్న ఈ-బైక్ ల ఉత్పత్తి..

ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతోవాటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైక్ ల మార్కెట్లోకి అంతగా రావడం లేదు. అయితే ఇప్పుడు ఒకాయా ఆధ్వర్యంలో స్పోర్ట్స్ లుక్ లో వచ్చిన ఈ బైక్ కొత్త ట్రెండ్ సృష్టించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?