AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Construction: 1000 చదరపు అడుగుల ఇంటి నిర్మాణంలో కేవలం స్లాబ్‌ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? పూర్తి లెక్కలివే..!

House Construction Slab Cost: 1000 చదరపు అడుగుల RCC స్లాబ్ వేయడానికి అయ్యే మొత్తం ఖర్చు సుమారు అంచనా వేసి అందిస్తున్నాము. ప్రస్తుతం ఖర్చులు పెరిగిన దృష్ట్యా పూర్తి వివరాలు తెలుసుకుని ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టడం మంచిదంటున్నారు బిల్డర్స్‌. ఈ ఖర్చులో సిమెంట్, స్టీల్, ఇసుక, కంకర, అలాగే లేబర్, సెంటరింగ్ ఛార్జీలు వంటి ప్రధాన వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు, మరియు ఇతర అనుబంధ వ్యయాలు వివరంగా చేర్చాము.

House Construction: 1000 చదరపు అడుగుల ఇంటి నిర్మాణంలో కేవలం స్లాబ్‌ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? పూర్తి లెక్కలివే..!
House Construction Slab Cost
Subhash Goud
|

Updated on: Aug 13, 2026 | 4:44 PM

Share

House Construction Slab Cost: గృహ నిర్మాణం అనేది ఒక పెద్ద పెట్టుబడి. అందులో ముఖ్యమైన భాగం స్లాబ్ నిర్మాణం. 2026 సంవత్సరంలో 1000 చదరపు అడుగుల RCC స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో వివరంగా తెలుసుకోవడం నిర్మాణ ప్రణాళికకు చాలా కీలకం. RCC స్లాబ్ (Reinforced Cement Concrete Slab) అనగా సిమెంట్, ఇసుక, కంకర కలిపిన కాంక్రీట్, స్టీల్ రాడ్లను ఉపయోగించి నిర్మించే బలమైన సమాంతర నిర్మాణ భాగం. ఇది భవనాలకు పైకప్పుగా (Roof), అంతస్తుల నేలగా ఉపయోగపడుతుంది. ఈ అంచనా ఖర్చులు మీకు ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో సహాయపడతాయి. సాధారణంగా ఒక ఇంటి స్లాబ్‌ను ఐదు అంగుళాల మందంతో వేయాలి.

ఇవి కూడా చదవండి: SBI Insurance: ఏడాదికి రూ.3 వేలు కడితే చాలు రూ.60 లక్షలు.. ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌!

ఈ స్లాబ్ నిర్మాణానికి అవసరమయ్యే ప్రధాన వస్తువులు, వాటి ఖర్చుల వివరాలు చూద్దాం.

1. సిమెంట్:

1000 చదరపు అడుగుల స్లాబ్‌కు సుమారు 120 నుండి 130 బస్తాల సిమెంట్ అవసరం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో బస్తా సిమెంట్ ధర (ఉదాహరణకు అల్ట్రా టెక్ వంటి బ్రాండ్) సుమారు రూ.330 నుంచి 380 వరకు ఉంది. ఇప్పుడు ఈ ఖర్చును రూ.330తో లెక్కిస్తే..

ఇవి కూడా చదవండి
  • సిమెంట్ ఖర్చు: 130 బస్తాలు x రూ.330 = రూ.42,900
  • రవాణా ఛార్జీలు: రూ.2,000
  • మొత్తం సిమెంట్ ఖర్చు: రూ.44,900 (అవి అంచనా మాత్రమే. ఇందులో ధర పెరగవచ్చు కూడా)

2. స్టీల్ (ఇనుము):

స్లాబ్ నిర్మాణంలో ఎక్కువగా ఖర్చు అయ్యేది స్టీల్ పైనే. 1000 చదరపు అడుగుల స్లాబ్‌కు సుమారు 1.8 టన్నుల (1800 కిలోలు) స్టీల్ అవసరం. ప్రస్తుతం ఒక కిలో స్టీల్ ధర సుమారు రూ.64 ఉంది.

  • స్టీల్ ఖర్చు: 1800 కిలోలు x రూ.64 = రూ.1,15,200
  • రవాణా ఛార్జీలు: రూ.1,000
  • మొత్తం స్టీల్ ఖర్చు: రూ.1,16,000

3. ఇసుక:

ఇసుక ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. 1000 చదరపు అడుగుల స్లాబ్‌కు సుమారు 25 టన్నుల ఇసుక పడుతుంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, ఒక టన్ను ఇసుక ధర సుమారు రూ.1,800 ఉంది.

  • ఇసుక ఖర్చు: 25 టన్నులు x రూ.1,800 = రూ.45,000
  • రవాణా ఛార్జీలు: రూ.3,000
  • మొత్తం ఇసుక ఖర్చు: రూ.48,000

4. కంకర (మెటల్):

స్లాబ్‌కు 20mm కంకరను ఉపయోగించడం మంచిది. ఇసుక వలె, కంకర కూడా సుమారు 25 టన్నులు అవసరం అవుతుంది. ఒక టన్ను కంకర ధర సుమారు రూ.550 ఉంది.

  • కంకర ఖర్చు: 25 టన్నులు x రూ.550 = రూ.13,750
  • రవాణా ఛార్జీలు: రూ.2,000
  • మొత్తం కంకర ఖర్చు: రూ.15,750

5. లేబర్, సెంటరింగ్ ఛార్జీలు:

ఈ ఖర్చులో సెంటరింగ్ పనులు, మిక్సర్ ఆపరేషన్, స్లాబ్ కు కాంక్రీట్ లిఫ్టింగ్ వంటివన్నీ కలిసి ఉంటాయి. సాధారణంగా, చదరపు అడుగుకు రూ.70 చొప్పున తీసుకుంటారు. లేబర్, సెంటరింగ్ ఖర్చు: 1000 చదరపు అడుగులు x రూ.70 = రూ.70,000

6. ఇతర ఖర్చులు:

స్లాబ్ నిర్మాణ సమయంలో కొన్ని అనుబంధ ఖర్చులు ఉంటాయి. వీటిలో స్టీల్ కట్టడానికి అవసరమైన బిల్డింగ్ వైర్, వాటర్‌ప్రూఫింగ్ కెమికల్స్, సెంటరింగ్ ప్లేట్‌లకు పూయడానికి ఆయిల్ వంటివి ఉంటాయి.

  • ఇతర ఖర్చులు: రూ.5,000
  • మొత్తం స్లాబ్ నిర్మాణ ఖర్చులు
  • సిమెంట్: ₹44,900
  • స్టీల్: రూ.1,16,000
  • ఇసుక: రూ.48,000
  • కంకర: రూ.15,750
  • లేబర్, సెంటరింగ్: రూ.70,000
  • ఇతర ఖర్చులు: రూ.5,000
  • 1000 చదరపు అడుగుల స్లాబ్‌కు మొత్తం అంచనా ఖర్చు: రూ.2,99,650
  • అయితే ఈ మెటీరియ్ ఖర్చులు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని ఖర్చుల వివరాలను చూస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే స్లాబ్ నిర్మాణానికి ఖర్చు రూ.3 లక్షలు దాటవచ్చు కూడా.

ఈ వివరమైన అంచనా 2026 సంవత్సరంలో 1000 చదరపు అడుగుల ఇంటి స్లాబ్ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చుపై మీకు స్పష్టమైన అవగాహనను అందిస్తుంది. నిర్మాణ పనులను ప్రారంభించే ముందు ఈ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవడం మీ బడ్జెట్ ప్రణాళికకు చాలా ఉపయోగపడుతుంది.

(ముఖ్య గమనిక- ఇందులోని ధరలు, మెటీరియల్‌ వివరాలు కేవలం అంచనా మాత్రమేనని గమనించండి. ఎందుకంటే ఆయా ప్రాంతాలలో రేటు ఒక్కో విధంగా ఉంటుంది. మీరు నిర్మాణం సాగించే ముందు ధరలు పెరగవచ్చు కూడా. అందుకే ఈ ధరలు ఫైనల్‌ అనుకోకూడదు. ధరల్లో కాస్త తేడా ఉండవచ్చని గమనించండి. ఈ వివరాలు బిల్డర్స్‌, మేస్త్రీలు తెలిపిన వివరాల ప్రకారం అందించడం జరిగింది.)

ఇది కూడా చదవండి: Parenting Tips: మీ పిల్లలు ఎక్కడైనా తప్పిపోతే ఏం చేయాలి? ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సిన 5 విషయాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us