AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colombia earthquake: శిథిలాల నుంచి పిల్లి కూన వెలికితీత.. హర్షధ్వానాలతో స్వాగతం పలికిన సిబ్బంది

Colombia earthquake: పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉండే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ లో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం శిథిలాల నుంచి పిల్లి కూనను వెలికితీయడంతో హర్షధ్వానాల నడుమ ఆ చిన్ని ప్రాణికి స్వాగతం పలికారు సిబ్బంది.

Colombia earthquake: శిథిలాల నుంచి పిల్లి కూన వెలికితీత.. హర్షధ్వానాలతో స్వాగతం పలికిన సిబ్బంది
Colombia Earthquake
Sharada V
|

Updated on: Aug 13, 2026 | 5:22 PM

Share

కొలంబియాలో ఆగస్ట్‌ 10న సంభవించిన భూకంపం ఊహకందని విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా దక్షిణ అమెరికా దేశంలో విరుచుపడిన ప్రకృతి విపత్తు లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేసింది. కన్న వాళ్లను కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు, షాక్‌ నుంచి ఇంకా తేరుకోని వారినీ ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. శిథిలాల కింద నుంచి ఎప్పుడు తమ వారు బయటికొస్తారా అని నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్నారు. అంతటి విషాదంలోనూ ఓ చిన్ని ప్రాణి “నేను బతికే ఉన్నాను” అంటూ బయటికొచ్చి కొత్త ఆశలను రేకెత్తించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారు జీవించే ఉండి  ఉంటారన్న నమ్మకాన్ని ఇతరుల్లో కలిగించింద. నాల్గవ రోజు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది శిథిలాల కింద సజీవంగా ఉన్న పిల్లి పిల్లను చూసి ఆనందంతో కేరింతలు కొట్టారు. నీరసించిన ఆ చిన్ని ప్రాణిని వెంటనే వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. దీంతో తమ వారిని ప్రాణాలతో చూస్తామన్న నమ్మకం అక్కడున్న కొందరికి కలిగింది. సోమవారం సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు దాదాపు 268 మంది మృతి చెందారు. 3 వేల మందికి పైగా గల్లంతయ్యారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

పెరీరా నగరంలో ప్రభావం తీవ్రం

రిక్టర్‌ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా పశ్చిమ కొలంబియాలో భారీ ప్రాణనష్టం నమోదైంది. 70కి పైగా భూ ప్రకంపనలు అనంతరం విరుచుకుపడ్డాయి. భయంతో ఇళ్లల్లో తలదాచుకోలేకపోతున్న జనం. ఇళ్లకు వెళ్లలేక ఆరుబయటే ఆశ్రయం పొందుతూ అక్కడే నిద్రిస్తున్నారు. పెరీరా నగరంలో భూకంపం తీవ్రత ఎక్కువగా నమోదుకావడంతో శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేసారు. నాలుగంతస్థుల భవనాలు సైతం పేకమేడల్లా కూలిపోవడంతో సహాయకసిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మానిజాలెస్ నగరం విలవిల

కాఫీ సాగుకు పేరు పొందిన మానిజాలెస్ పర్వత ప్రాంతంలో భారీ ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. పశ్చిమ కొలంబియాలోని మరికొన్ని నగరాలలో కూడా భూకంపం ఊహించని విధ్వంసం మిగిల్చింది. గల్లంతైన 3 వేల మంది కోసం ఆర్మీ గాలింపు చర్యలు చేపడుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాలి నగరంలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం శిథిలాల కింద నుంచి ఆరు నెలల పసిపాపను వెలికితీసారు. నూతన అధ్యక్షుడు అబెలార్డో గాబ్రియెల్ డి లా ఎస్ప్రియెల్లా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ఈ భూకంపం తొలి సవాలుగా మారింది. జూన్ నెలలో పక్కనే ఉన్న వెనిజులాలో సంభవించిన భూకంపం తాలూకు విషాదం ఇంకా మరువక ముందే కొలంబియాలో ఈ దారుణం జరిగింది.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా