Air India: అదిరిపోయే విషయం చెప్పిన ఎయిర్ ఇండియా..! ఆ ప్రయాణికులకు పండగే..
టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజెన్లకు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై 10 శాతం నుండి 25 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో అదనపు బ్యాగేజీ అనుమతి కూడా ఉంది.

టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజెన్లకు అదిరిపోయే విషయం చెప్పింది. 60 ఏళ్లు, ఆపైబడిన ప్రయాణికులకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వారు చేసే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలకు ఈ రాయితీలు వర్తిస్తాయని సంస్థ వెల్లడించింది. కొత్త స్కీమ్ కింద టికెట్ బేస్ ధరపై 10 శాతం తగ్గింపు ఇస్తామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఎకానమీ నుంచి ఫస్ట్‌క్లాస్ వరకు అన్ని క్యాబిన్లకు ఇది వర్తిస్తుంది.
దేశీయ విమాన ప్రయాణాల్లో విమాన టికెట్ బేస్ ధరలో 25 శాతం తగ్గింపు ప్రకటించింది సంస్థ. సీనియర్ సిటిజెన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే.. ఈ రాయితీని పొందొచ్చు. అయితే ముందుగా బుక్ చేసుకున్న టిక్కెట్‌ను ఒక డేట్ ఛేంజ్‌కు అవకాశం ఉండగా.. 15 కేజీల అదనపు బ్యాగేజీని అనుమతించనున్నారు. ఇవిగాక.. ప్రోమోకోడ్‌ను ఉపయోగించి యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే.. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఒక్కో ప్రయాణికుడికి అదనపు లబ్ధి చేకూరనుంది. వెబ్‌సైట్, యాప్‌లో ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు.
ఒకసారికి ప్రయాణ తేదీని మార్చుకోవడానికి వీలుంది. అయితే అప్పుడు ఛార్జీల్లో వ్యత్యాసం ఉంటే చెల్లించాల్సి ఉంటుంది. ఈ డిస్కౌంట్లో ఒక ప్రయాణికుడు 10 కేజీలు అదనంగా లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించేవారు 23 కేజీల బరువున్న రెండు లగేజీలను తీసుకెళ్లొచ్చు. అదే సమయంలో బిజినెస్ క్లాస్‌లో వెళ్లేవారు 32 కేజీల రెండు లగేజీలను వెంట తీసుకెళ్లొచ్చు.
ఆఫర్‌ను ఎలా పొందాలి..
ఎయిర్ ఇండియా సిటీ లేకపోతే ఎయిర్‌పోర్ట్ టికెటింగ్ ఆఫీసెస్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్, వెబ్‌సైట్, యాప్ ద్వారా సీనియర్ సిటిజెన్లు టికెట్లు కొనుగోలుచేయొచ్చు. ఆ సమయంలో పుట్టిన తేదీ నిరూపించేలా వ్యాలీడ్ ఫొటో ఐడీని చూపించాల్సి ఉంటుంది. టికెటింగ్, చెక్‌ఇన్, బోర్డింగ్ సమయంలో ప్రయాణికులు వారి ఐడీని సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అందులో విఫలమైతే.. పెనాల్టీ కూడా పడొచ్చు. ఈ స్కీమ్‌కు సంబంధించి ఏవైనా సవరణలు ప్రకటిస్తే తప్ప.. అప్పటివవరకు వన్‌వే, రిటర్న్ బుకింగ్స్‌కు ఈ రాయితీలు వర్తించనున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




