Agriculture Loan: లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారా.. అవసరం లేదు కేవలం ఒక్క మిస్ట్ కాల్ ఇస్తే చాలు..
మీరు రైతు అయితే, వ్యవసాయ పనుల కోసం డబ్బు అవసరముంటే బ్యాంకుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తర్వాత ఇప్పుడు బ్యాంకులు కూడా రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి. మీరు కేవలం మిస్డ్ కాల్‌తో వ్యవసాయ రుణాన్ని పొందవచ్చు.
రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులను ఆదుకోవడంలో వెనుకడుగు వేయడం లేదు. రైతులకు అనేక రకాల పరికరాలు, వ్యవసాయ పనులకు విత్తనాలు, వీటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వాలు రైతులకు భారీ సబ్సిడీ ఇస్తున్నాయి. ప్రభుత్వాలతోపాటు చాలా బ్యాంకులు కూడా రైతులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి. రైతులు బ్యాంకుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా బ్యాంకులు రైతులకు రుణాలను అందిస్తున్నాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB బ్యాంక్) కూడా తమ వంతుకుగా రైతులకు రుణాలను వేగంగా అందిస్తున్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. మీకు లోన్ అవసరం ఉంటే బ్యాంకు చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఒక మిస్డ్ కాల్‌తో రైతులకు డబ్బు అవసరాన్ని తీర్చిందని పేర్కొంది.
వ్యవసాయ రుణ ఆఫర్
నేడు చాలా బ్యాంకులు రైతులకు అతి తక్కువ ధరకు రుణాలు ఇస్తున్నాయి. పీఎన్‌బీ బ్యాంకు రైతులకు తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాన్ని అందజేస్తోంది. దీనితో పాటు కొన్ని బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తున్నాయి. దీని కోసం, కొన్ని షరతుల ఆధారంగా రుణం ఇవ్వబడుతుంది. దేశంలోని రైతుల కోసం PNB బ్యాంక్ వ్యవసాయ రుణాన్ని అందిస్తోంది. ఇందులో రైతులు చాలా సులభమైన, నిరాడంబరమైన నిబంధనలతో రుణాలు తీసుకోవచ్చు.
PNB సమాచారం ఇచ్చింది
कैसे करते हैं कृषि ऋण के लिए आवेदन? जाने हमारे यूट्यूब चैनल पर! आज ही सब्सक्राइब करें:https://t.co/K7xY2L2dyU #agriculture pic.twitter.com/xWpnWrI7ZU
— Punjab National Bank (@pnbindia) December 23, 2022
దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పీఎన్‌బీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. PNB, PNB వ్యవసాయ రుణంతో కొత్త పురోగతి వస్తుందని, జీవితం మెరుగుపడుతుందని ఇందులో పేర్కొంది. వ్యవసాయ రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలి..? అనే పూర్తి సమాచారం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
ఇలా వ్యవసాయ రుణం తీసుకోవచ్చు
మీరు PNB వ్యవసాయ రుణం కింద దరఖాస్తు చేయవలసి వస్తే, మీరు రుణం తీసుకోవడానికి చాలా సులభమైన మార్గాలున్నాయి. రుణం తీసుకోవాలంటే రైతులు వీటిలో ఏదైనా ఒక పద్ధతిని అనుసరించాలి.
- 56070కి ‘లోన్’ అని SMS చేయండి
- 18001805555కు మిస్డ్ కాల్ ఇవ్వండి
- కాల్ సెంటర్‌ను 18001802222లో సంప్రదించండి
- నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ netpnb.com ద్వారా దరఖాస్తు చేసుకోండి
- PNB One ద్వారా దరఖాస్తు చేసుకోండి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం