Second Hand Car: మీరు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేస్తున్నారా..? ఈ విషయాలను తప్పనిసరి తెలుసుకోండి
కారు కొనాలనేది అందరి కల. కానీ కొత్త కారు కొనుగోలు చేయాలంటే అందరికి కుదరదు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో అది నెవేరదు. కానీ సెకండ్ హ్యాండ్ కార్లు..
కారు కొనాలనేది అందరి కల. కానీ కొత్త కారు కొనుగోలు చేయాలంటే అందరికి కుదరదు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో అది నెవేరదు. కానీ సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తుంటారు. మీరు కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే కొన్ని విషయాలను గుర్తించుకోవడం ముఖ్యం. తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
ధర విషయంలో తొందరపడకండి: సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు ఏ మాత్రం తొందరపడకూడదు. అన్ని విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే తొందరపడితే మీరు మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు కారును కొనుగోలు చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు ఉపయోగించిన కారుని కొనుగోలు చేసినప్పుడు అన్ని ఆప్షన్స్‌ను పరిశీలించడం ఉత్తమం. వివిధ కార్లతో పోల్చి ధరను నిర్ణయించుకోండి.
లోపాలను గుర్తించండి
సెకండ్ హ్యాండ్ కారును కొంటున్నారంటే ముందుగా వాటిలో ఉండే లోపాలను గుర్తించడం మంచిది. ఏవైనా లోపాలున్నట్లయితే కారు యజమానికి తెలియజేయండి. అలాగే కారు లోపాలకు సంబంధించిన ఖర్చులను కూడా లెక్కలేసి యజమానితో చెప్పండి. దీని వల్ల మీరు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
బేరసారాలు: మీరు కారు కొనేముందు యజమానితో బేరసారాలు ఆడటం చాలా ముఖ్యం. మీ బేరసారాలపై కారు ఖరీదు ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు చూసిన కారును అదే కారు కావాలని పట్టుబడకూడదు. దీని వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది.
టెస్ట్ డ్రైవ్ చేయండి: కారు కొనుగోలు చేయడానికి ముందు టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి. కారు కంఫర్ట్ లెవెల్, పనితీరుపై మంచి అవగాహన కోసం వివిధ రకాల రోడ్ల గుండా కనీసం కొన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేయండి. అప్పుడు కారు గురించి మీకో క్లారిటీ వస్తుంది. మీకు కారు గురించి పెద్దగా తెలియకపోతే తెలిసిన వారిని వెంట తీసుకెళ్లడం మంచిది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంజన్ వైబ్రేషన్ మినహా ఎలాంటి వింత శబ్దాలు వెలువడకూడదు. గేర్ షిఫ్ట్‌లు తప్పనిసరిగా స్మూత్‌గా ఉండాలి. అలాగే వాహనం క్లచ్‌ను వదిలేటప్పుడు శబ్దం, కుదుపులకు గురికాకూడదు. స్టీరింగ్ వైబ్రేట్ కాకూడదు. లేకుంటే లోపాలు తలెత్త అవకాశం ఉంది. బ్రేకింగ్ విషయంలో కూడా గమనించాలి.
ఇంటీరియర్స్: ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి మెకానిక్‌ని తీసుకెళ్లండి. బానెట్‌ను పైకెత్తి బెల్టులు, ఇతర గొట్టాలు, ఇతర కాంట్రాప్షన్‌ల పరిస్థితిని పరిశీలించండి. ఏసీ ఉంటే దాని గురించి పరిశీలించండి. ఏమైనా లోపాలున్నాయా అని గమనించండి.
కారు డాక్యుమెంట్లను పరిశీలించండి: చివరికి కారు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటే వాహనానికి సంబంధించిన పత్రాలను సరిగ్గా ఉన్నాయా లేదా విషయాన్ని పరిశీలించండి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ పేపర్లు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) అన్నీ ముఖ్యమైనవి. కారును రుణం ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఎన్‌ఓసీ తప్పనిసరి. దీని వల్ల రుణం చెల్లించబడిందో లేదో ధృవీకరిస్తుంది. ఎందుకంటే నకిలీ పత్రాలు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను తనిఖీ చేయడం ముఖ్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి