Aadhaar Card: ఆధార్ కార్డు వాడుతున్నవారికి పండుగ.. ఉచితంగా ఆ సేవలు.. ప్రతీఒక్కరికీ అవకాశం..
ఆధార్ కార్డు వినియోగదారులకు భారీ శుభవార్త. ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు యూఐడీఏఐ అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగదారులందరూ వినియోగించుకోవాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. గతంలో ఉన్న గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అప్డేట్ చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

ఆధార్ కార్డు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. ఆధార్ లేనిది ఇప్పటి పరిస్థితుల్లో ఏ పని జరగదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేదా సిమ్ కార్డు కావాలన్నా ఆధార్ అనేది అవసరం. అయితే ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ సమయంలో సమస్యలు ఎదురవుతాయి. అయితే ఆధార్ ఉన్నవారికి శుభవార్త. ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు గడువును యూఐడీఏఐ పొడిగించింది. ఒక సంవత్సరం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఉచితంగా అప్డేట్
డేట్ ఆఫ్ బర్త్ నుంచి అడ్రస్ వరకు అన్నీ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. జూన్ 14,2027 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. మైఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఉచితంగా చేసుకోవచ్చని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఈ వెబ్ సైట్ లో గుర్తింపు పత్రాలు, చిరునామా పత్రాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం వల్ల ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు ఉచిత సదుపాయాన్ని పొడిగించాలని యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. చాలా ఏళ్ల క్రితం ఆధార్ పొంది వివరాలను అప్డేట్ చేసుకోనివారు అవసరమైన పత్రాలను ఉపయోగించి త్వరగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. దీని వల్ల ఆధార్ డేటాబేస్ లో ఖచ్చితమైన, తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది.
అప్డేట్ చేసుకోవడం ఎలా..
-మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి
-ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వండి
-ప్రొఫైల్ లో పేరు, అడ్రస్, ఇతర సమాచారం చెక్ చేసుకోండి
-సమాచారం తప్పుగా ఉంటే సరిచేసుకోండి
-ఆ తర్వాత పై వివరాలు అన్నీ సరైనవి నేను ధృవీకరిస్తున్నాను అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
-డ్రాప్ మెనూ నుంచి గుర్తింపు పత్రాలను ఎంచుకోండి
-ఫైల్ 2ఎంబీ కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి
-ఇక అడ్రస్ ప్రూఫ్ ఎంచుకోండి
-ఆ తర్వాత సమ్మతిని తెలియజేసి ఫారం సమర్పించండి.
