Aadhaar Center: మీ ప్రాంతంలో ఆధార్‌ సెంటర్‌ ఎక్కడుందో తెలియడం లేదా? ఇలా చేస్తే సులభంగా తెలుసుకోవచ్చు

ఇప్పుడున్న రోజుల్లో ఆధార్‌ కార్డు ఎంతో ముఖ్యమైనది. అన్ని డాక్యుమెంట్లలో అతిగా ఉపయోగపడేది ఆధార్‌ కార్డు. ఇది లేనిది ఏ పనులు జరిగే పరిస్థితి లేదు. ప్రభుత్వ, ప్రైవేటు..

Aadhaar Center: మీ ప్రాంతంలో ఆధార్‌ సెంటర్‌ ఎక్కడుందో తెలియడం లేదా? ఇలా చేస్తే సులభంగా తెలుసుకోవచ్చు
Aadhaar Center
Follow us
Subhash Goud

|

Updated on: Sep 30, 2022 | 6:35 PM

ఇప్పుడున్న రోజుల్లో ఆధార్‌ కార్డు ఎంతో ముఖ్యమైనది. అన్ని డాక్యుమెంట్లలో అతిగా ఉపయోగపడేది ఆధార్‌ కార్డు. ఇది లేనిది ఏ పనులు జరిగే పరిస్థితి లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు చిన్నపాటి పనులకు కూడా ఇది తప్పనిసరి. అయితే ఆధార్‌ కార్డులో చాలా మంది పేర్లు, అడ్రస్‌లు తప్పుగా పడుతుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆధార్‌ సెంటర్‌ ఎక్కడుందో సులభంగా తెలుస్తుంది. కానీ పెద్ద పెద్ద నగరాలలో అయితే ఆధార్‌ సెంటర్‌ ఎక్కడుందో కూడా తెలియదు. మీరున్న ప్రాంతంలోనే ఆధార్‌ సెంటర్‌ ఉంటుంది. కానీ అది ఎక్కడుందో అడ్రస్‌ తెలుసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే అటువంటి సమయంలో మీ దగ్గరలో ఎక్కడుందో తెలుసుకునే సదుపాయం కూడా ఉంది.

అయితే మీ సమీపంలోని ఆధార్‌ సెంటర్‌ గూగుల్‌ మ్యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ అది అప్పుడప్పుడు సరిగ్గా చూపించదు. అలాంటి సమస్య ఉండకుండా ఆధార్‌ జారీ సంస్థ ఉడాయ్‌ (UIDAI) ఇస్రోతో జతకట్టింది. ఇస్రోకు అనుబంధంగా పనిచేసే నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ తో కలిసి ‘భువన్‌ ఆధార్‌’ అనే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ పోర్టల్‌లో మూడు రకాల ఫీచర్స్‌:

ఇవి కూడా చదవండి

ఈ పోర్టల్‌లో మూడు రకాల ప్రీమియం ఫీచర్స్‌ ఉన్నాయి. మీ సమీపంలోని ఆధార్‌ కేంద్రాలను తెలుసుకోవడంతో పాటు వాటి వద్దకు వెళ్లే మార్గం కూడా చూపించే సదుపాయం ఉంది. ఇది వరకు ఆధార్‌ వివరాలను ధృవీకరించాలంటే ఐరిస్‌, వేలిముద్రలు స్కాన్‌ చేయాల్సి ఉండేది. కానీ UIDAI ఇటీవల ఆధార్‌ ఫేస్‌ఆర్‌డీ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంట్లోనే ఉండి మీ ముఖాన్ని స్కాన్‌ చేయడం ద్వారా ఆధార్‌ వివరాలను ధృవీకరించుకోవచ్చని తెలిపింది. ఈ యాప్‌ ఇటీవల అందుబాటులోకి రావడంతో ఆధార్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.

గూగుల్‌లో ఎలా వెతకాలి..

ముందుగా గూగుల్‌లోకి వెళ్లి ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. ఈ లింక్‌ పోర్టల్‌లోకి వెళ్లి స్క్రీన్‌కు ఎడమ వైపు నాలుగు డ్రాప్‌ డౌన్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. మీ సమీపంలో ఉండే ఆధార్‌ నమోదు కేంద్రాన్ని తెలుసుకునేందుకు ఆప్షన్లలో ‘సెంటర్స్‌ నియర్‌బై’ను ఎంపిక చేసుకోవాలి. వెంటనే మీకు దగ్గరలో ఉన్న కేంద్రాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీంతో ఆధార్‌ కేంద్రాల కోసం వెతికే పని లేకుండా ఇంట్లోనే ఉండి మొబైల్‌లో తెలుసుకుని వెళ్లవచ్చు.

Aadhaar Center

Aadhaar Center

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి