Aadhaar Card: ఆధార్ లేకపోతే సబ్సిడీ లేదు.. మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక సర్క్యులర్ జారీ..!
Aadhaar Card: ఈ రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర చిన్నపాటి పనులు జరగాలన్నా ఆధార్..
Aadhaar Card: ఈ రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర చిన్నపాటి పనులు జరగాలన్నా ఆధార్ తప్పనిసరి. ఆధార్ కార్డు లేకుంటే అనేక ప్రభుత్వ పథకాలు పొందలేరు. అంతేకాకుండా ప్రభుత్వానికి చెందిన ఇతర ప్రయోజనాలు పొందలేరని గుర్తించుకోవాలి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీల ప్రయోజనాలను పొందడానికి ఆధార్ తప్పనిసరి అని UIDAI స్పష్టం చేసింది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈ సర్క్యులర్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖలు ఆధార్ ఉన్న పౌరులు మాత్రమే పథకాలు, సబ్సిడీల ప్రయోజనాలను పొందేలా చూడాలని కోరింది. ఆధార్ లేనివారికి ఎలాంటి ప్రయోజనాలు అందించబడవని స్పష్టం చేసింది.
నివేదిక ప్రకారం.. ఇప్పుడు ఆధార్ నిబంధనలను మరింత కఠినతరం కానున్నాయి. ఆధార్ కోసం ఇప్పటికే ఉన్న సూచనల ప్రకారం.. ఒక వ్యక్తికి ఆధార్ నంబర్ లేకపోతే అతను ఇతర పత్రాలను చూపించడం ద్వారా సబ్సిడీని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఆధార్ నంబర్ లేకపోతే అతను దాని కోసం దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసిన సమయంలో రసీదు లేదా ఎన్‌రోల్‌మెంట్ స్లిప్‌ను చూపించి మాత్రమే సబ్సిడీ లేదా ప్రభుత్వ పథకం ప్రయోజనం పొందాలని సర్క్యులర్‌లో చెప్పబడింది. ఎవరైనా ఆధార్ లేకుంటే లేదా అతను ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోకపోతే అతను ఇతర పత్రాలను చూపించి ప్రభుత్వ మినహాయింపు పొందలేడు.
ఆధార్ నిబంధనలు ఎందుకు కఠినంగా మారాయి?
సబ్సిడీలు, మినహాయింపులను నిరోధించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇలాంటివి అరికట్టేందుకే ఆధార్ కార్డును ప్రారంభించారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం చౌక ధరలకు రేషన్, తక్కువ ధరలకు రుణాలు వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిని ఆధార్ సహాయంతో పంపిణీ చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి