UPI Scam: వెలుగులోకి నయా మోసం.. ఈ సారి యూపీఐ లింక్ చేసిన ఖాతాలే టార్గెట్
తాజాగా ఖాతాదారులను మోసగించేందుకు స్కామర్లు మరో కొత్త పద్ధతిని అవలంభిస్తున్నారు. కనీసం ఓటీపీ కూడా అవసరం లేకుండా యూపీఐ ఖాతాతో లింక్ అయిన బ్యాంకు ఖాతాను ఖాళీ చేయడానికి ఓ కొత్త పంథాను ఎంచుకున్నారు.
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వేగవంతమైన అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ విషయంలో అనే సౌకర్యాలు ఖాతాదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ పద్ధతి ఆర్థిక లావాదేవీలను అతుకులు, అవాంతరాలు లేకుండా చేసింది. అయితే ఈ పురోగతి సైబర్-మోసం కేసుల పెరుగుదలకు దారి తీస్తుంది. ఇప్పటి వరకూ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఓటీపీ మోసాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరో ఓ ఆగంతకుడు మన బ్యాంకు వివరాలను తస్కరించి వినియోగాదారుడికి వచ్చిన ఓటీపీ తెలుసుకోవడానికి బ్యాంకు అధికారిగా పరిచయం చేసుకుని ఓటీపీ తెలుసుకుంటారు. దాన్ని బాధితుడు తెలిపిన వెంటనే అతడి ఖాతా ఖాళీ అవుతుంది. ఈ తరహా మోసాలపై అధికంగా ఫిర్యాదులు రావడంతో బ్యాంకులు కూడా ఖాతాదారులను అలెర్ట్ చేయడం ప్రారంభించడంతో ఈ తరహా మోసాలు ఈ మధ్య కాలంలో తగ్గాయి. అయితే తాజాగా ఖాతాదారులను మోసగించేందుకు స్కామర్లు మరో కొత్త పద్ధతిని అవలంభిస్తున్నారు. కనీసం ఓటీపీ కూడా అవసరం లేకుండా యూపీఐ ఖాతాతో లింక్ అయిన బ్యాంకు ఖాతాను ఖాళీ చేయడానికి ఓ కొత్త పంథాను ఎంచుకున్నారు. స్కామర్లు చేసే ఆ మోసం ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఈ కొత్త పద్ధతిలో మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన యూపీఐను స్కామర్లు లక్ష్యంగా చేసకుంటారు. ఇటీవల ఓ 25 ఏళ్ల యువకుడు షాపింగ్ వెబ్‌సైట్ నుంచి రూ.30వేలకు మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. ఫోన్ మే 17న డెలివరీ అవుతుందని అతడికి మెసేజ్ వచ్చింది. అయితే అతను కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌నంటూ మే 16న అతడికి కాల్ వచ్చింది. అలాగే సదరు యువకుడికి మోసగాడు ఉత్పత్తి గురించి వ్యక్తికి చెప్పడం ఇక్కడ కొసమెరుపు. అలాగే మోసగాడు యువకుడి అడ్స్‌ను నిర్ధారించమని కోరాడు. అతను అప్పటికే ఆన్‌లైన్ స్టోర్‌లో అతని చిరునామాను నమోదు చేసినప్పటికీ లింక్‌లో అందుకున్న చిరునామాను ధ్రువీకరించమని స్కామర్ కోరడంతో అతడితో మాట్లాడాడు. అయితే ఆ లింక్ యూపీఐ చెల్లింపు ఎంపికను తెరిచింది. స్కామర్ చిరునామాను ధ్రువీకరించడానికి రూ.5 చెల్లించాలని వ్యక్తిని అడిగాడు. దీంతో సదరు యువుడు వెంటనే అలెర్ట్ అయ్యి చెల్లింపును నిలిపివేశాడు. అలాగే మోసగాడితో మాట్లాడిన మాటలు వీడియో రికార్డ్ ఉందని మోసగాడికి తెలిపాడు. వెంటనే ఆ వీడియో డిలీట్ చేయమని కోరాడు. దానికి యువకుడు నిరాకరించడంతో చివరికి కాల్‌ను డిస్‌కనెక్ట్ చేశాడు. మీకు ఇలాంటి అనుమానాస్పద కాల్ వచ్చినట్లయితే మీరు వెంటనే దాన్ని డిస్‌కనెక్ట్ చేసి, నంబర్‌ను పోలీసులకు నివేదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి