Kerala: పేటీఎం లేకున్నా రూ.20 వేలు ట్రాన్స్ ఫర్ అయ్యాయి.. సైబర్ మోసంతో అవాక్కైన బాధితుడు

ప్రస్తుత రోజుల్లో అంతా డిజిటలే. జేబులో ఒక్క రూపాయి లేకున్నా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న...

Kerala: పేటీఎం లేకున్నా రూ.20 వేలు ట్రాన్స్ ఫర్ అయ్యాయి.. సైబర్ మోసంతో అవాక్కైన బాధితుడు
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 26, 2022 | 8:16 PM

ప్రస్తుత రోజుల్లో అంతా డిజిటలే. జేబులో ఒక్క రూపాయి లేకున్నా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న దుకాణాల వ్యాపారులు యూపీఐ పేమెంట్లను ఉపయోగిస్తున్నారు. లిక్విడ్ క్యాష్ ఇవ్వాల్సి పని లేకుండా కోడ్ స్కాన్ చేసి, డబ్బులు పంపించడం ఈజీగా మారిపోయింది. ఈ పద్ధతి అన్ని చోట్లా విస్తృతంగా వ్యాప్తి చెందింది. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. కొత్త కొత్త నేరాలు చేస్తున్నారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి దాదాపు రూ.20,000 మాయమయ్యాయి. డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు బ్యాంకు అధికారులను ఆరా తీశాడు. ఆఖరుకు సైబర్ క్రైం పనిగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేరళలోని మలప్పురం జిల్లా వండూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సెల్ ఫోన్ కు దాదాపు రూ.20వేల రూపాయలు విత్​డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అవాక్కైన యువకుడు వెంటనే బ్యాంకుకు వెళ్లి.. ఏం జరిగిందని ఆరా తీశాడు. మూడు సార్లు పేటీఎం ద్వారా డబ్బు డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉందని బ్యాంకు సిబ్బంది యువకుడికి తెలిపారు.

బ్యాంకు అధికారుల సమాధానంతో షాక్ అయిన యువకుడు.. అసలు తనకు పేటీఎం అకౌంటే లేదని చెప్పాడు. ఇది సైబర్ మోసగాళ్ల పని అయి ఉంటుందని ఫిర్యాదు చేశాడు. ఇలాంటి కేసును చూడటం ఇదే తొలిసారి అని బ్యాంకు అధికారులు చెప్పారు. బ్యాంకు ఐటీ విభాగం పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ తో ట్రాన్స్ ఫర్ అయి ఉంటే నగదును తిరిగి ఇచ్చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ వ్యవహారం సైబర్ నేరగాళ్ల పని అయి ఉంటుందన్న అనుమానంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్​ఫర్​చేసినట్టుగా ఉన్న స్టేట్మెంట్ సహా ఇతర అంశాల ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు.