Supreme Court: వ్యభిచారం ఒక వృత్తి.. సెక్స్ వర్కర్లపై కేసులు వద్దు.. సుప్రీం సంచలన తీర్పు..

Supreme Court: వ్యభిచారంపై భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. సెక్స్ వర్కర్ పనిలో జోక్యం చేసుకోవద్దంటూ పోలీసులను..

Supreme Court: వ్యభిచారం ఒక వృత్తి.. సెక్స్ వర్కర్లపై కేసులు వద్దు.. సుప్రీం సంచలన తీర్పు..
Supreme Court Main
Follow us
Shiva Prajapati

|

Updated on: May 26, 2022 | 7:29 PM

Supreme Court: వ్యభిచారంపై భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. సెక్స్ వర్కర్ పనిలో జోక్యం చేసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించింది. వ్యభిచారం కూడా ఒక వృత్తి అని పేర్కొన్న సుప్రీంకోర్టు.. సెక్స్ వర్కర్ల పనిలో జోక్యం చేసుకోవద్దంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులను కోర్టు ఆదేశించింది. వయోజన, అంగీకారంతో వ్యభిచారం చేసే సెక్స్ వర్కర్లపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

సెక్స్ వర్కర్ల సమస్యలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. సెక్స్ వర్కర్లు కూడా చట్ట ప్రకారం గౌరవం, సమాన రక్షణకు అర్హులని పేర్కొంది. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు 6 ఆదేశాలు జారీ చేసింది. సెక్స్ వర్కర్లు కూడా దేశ పౌరులేనని కోర్టు పేర్కొంది. వారు కూడా చట్టం ప్రకారం సమాన రక్షణకు అర్హులు అని తెలిపింది.

ఇవి కూడా చదవండి

వ్యభిచార గృహాన్ని నిర్వహించడం చట్టవిరుద్ధమే అయినప్పటికీ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఏదైనా కారణాల వల్ల పోలీసులు వారి ఇంటిపై దాడి చేయాల్సి వస్తే, సెక్స్ వర్కర్లను అరెస్టు చేయవద్దని, వారిని వేధించవద్దని స్పష్టం చేసింది కోర్టు. వారి వారి స్వంత ఇష్టానుసారం వేశ్యగా మారడం చట్టవిరుద్ధం కాదని, వ్యభిచార గృహాన్ని నిర్వహించడం మాత్రమే చట్టవిరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే, ఒక స్త్రీ తన బిడ్డను తల్లి నుండి వేరు చేయలేనందున, ఒక సెక్స్ వర్కర్ పిల్లవాడు వ్యభిచార గృహం లేదా సెక్స్ వర్కర్‌తో నివసిస్తున్నట్లయితే, ఆ పిల్లవాడు అక్రమ రవాణాకు గురైనట్లు రుజువు కాదుని అన్నారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!