Union Budget 2021 Income Tax: ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు ప్రస్తావన లేని నిర్మలమ్మ బడ్జెట్

Union Budget 2021 Income Tax in Telugu: 2021-22 సంవత్సరానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం  లోక్ సభకు సమర్పించిన బడ్జెట్ ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి వర్గాలకు పూర్తిగా నిరాశను  మిగిల్చింది

Union Budget 2021 Income Tax: ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు ప్రస్తావన లేని నిర్మలమ్మ బడ్జెట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 01, 2021 | 1:29 PM

Union Budget 2021 Income Tax: 2021-22 సంవత్సరానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం  లోక్ సభకు సమర్పించిన బడ్జెట్ ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి వర్గాలకు పూర్తిగా నిరాశను  మిగిల్చింది. ఈ బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతారని ఈ వర్గాలు ఎంతగానో ఆశించాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా తమ ఆదాయం చాలావరకు తగ్గడంతో కనీసం ఈ బడ్జెట్లో ఈ ఊరట లభిస్తుందని భావించాయి. కానీ  ఈ బడ్జెట్లో ఆ ఊసే లేకుండా పోయింది. అసలు ఆదాయపు పన్ను స్లాబుల జోలికి ఆమె వెళ్ళలేదు. ఈ బడ్జెట్ నెవర్ బిఫోర్ లైక్ బడ్జెట్ అని ఆమె అభివర్ణించారు. కానీ ఈ స్లాబులు మాత్రం పాతవే ఉన్నాయి. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ ని 50 వేలనుంచి లక్ష రూపాయలకు పెంచుతారని,  దీనివల్ల టాక్స్ పేయర్స్ కి ఊరట కలుగుతుందని భావించినా ఆ ప్రసక్తి ఈ బడ్జెట్లో లేకుండా పోయింది.

నిజానికి ఇదివరకటి బడ్జెట్ సిఫారసుల్లో ఈ పెంపు ఉండాలని ప్రతిపాదించారు. ఆదాయపు పన్నుతో నిమిత్తం లేకుండా పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్ కలగాలంటే దీన్ని ఈ మొత్తానికి పెంచాలన్నది ప్రతిపాదన. సాధారణంగా దేశంలో ద్రవ్యో ల్బణం  కారణంగా ఇది ప్రతి ఏడాదీ పెరుగుతుంటుంది.

Also Read:

Union Budget 2021 Telugu Live: కేంద్ర బడ్జెట్ హైలైట్స్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

ప్రజా రవాణా కోసం రూ.18వేల కోట్లతో ప్రత్యేక పథకం.. ఆ లక్ష్యానికి రెండంకెల వృద్ధి తప్పనిసరి: నిర్మలా సీతారామన్‌

Budget 2021 Agriculture: రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం, అగ్రి ప్రొక్యూర్ మెంట్ పెంచుతాం , నిర్మల.