AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: ఆత్మ నిర్భర్‌ భారత్‌లో మహిళల పాత్ర కీలకం.. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఆలయ ప్రస్తావన

Budget 2022: పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తున్నారు. కరోనా మహమ్మారిపై భారత్‌ చేస్తున్న పోరాటం..

Budget 2022: ఆత్మ నిర్భర్‌ భారత్‌లో మహిళల పాత్ర కీలకం.. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఆలయ ప్రస్తావన
Subhash Goud
|

Updated on: Jan 31, 2022 | 11:57 AM

Share

Budget 2022: పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తున్నారు. కరోనా మహమ్మారిపై భారత్‌ చేస్తున్న పోరాటం స్పూర్తిదాయకమని అన్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అయతే కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 2022-23 బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు కరోనా ప్రతికూల పరిస్థితులు, ఇటు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యలో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయనుందనేది ఆసక్తికరంగా మారింది.

కరోనా మహమ్మారిపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నానని అన్నారు. దేశ సురక్షిత భవిష్యత్‌ కోసం గతాన్ని గుర్తుతెచ్చుకోవడం ముఖ్యమని, వచ్చే 25 ఏళ్లపాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషిచేస్తోంది అన్నారు.

ఏడాది కంటే తక్కువ వ్యవధిలో 150 కోట్ల వ్యాక్సినేషన్లు అధిగమించామని, భారత వ్యాక్సిన్లు కోట్లమంది ప్రాణాలను కాపాడాయని వివరించారు. అర్హులైన 90 శాతం కంటే ఎక్కువమంది మొదటి డోసు టీకా తీసుకున్నారని, ప్రభుత్వ సున్నిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్యసేవలు అందుతున్నాయన్నారు. సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కోట్లమంది ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను పొందారన్నారు.

డిజిటల్‌ ఇండియాకు యూపీఐ విజయవంతమైన ఉదహరణ అని, డిజిటల్‌ చెల్లింపులు అంగీకరిస్తున్నారనేందుకు గొప్ప ఉదాహరణ అని చెప్పారు. కరోనాపై పోరాటంలో భాగమైన ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు రాష్ట్రపతి. అంబేడ్కర్‌ ఆదర్శాలను మార్గదర్శక సూత్రంగా ప్రభుత్వం పరిగణిస్తుందని, ప్రభుత్వ కృషితో యోగా, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యానికి ఆదరణ పెరుగుతోందన్నారు. జనఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు అందుబాటులో మందులు ఉన్నాయని, మందులు తక్కువ ధరతో ప్రభుత్వం చికిత్స ఖర్చును తగ్గించిందని వెల్లడించారు. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో మహిళల పాత్ర కీలకమన్నారు.

ప్రధానమంత్రి స్వనిధి యోజనతో వీధి వ్యాపారులకు ప్రయోజనం

ప్రధానమంత్రి స్వనిధి యోజనతో వీధి వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని, ఇప్పటివరకు 28 లక్షలమంది వీధి వ్యాపారులు ఆర్థిక సాయం పొందారన్నారు. వీధి వ్యాపారులను ప్రభుత్వం ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తోందని, ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులతో భారీగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు. ఎంఎస్‌ఎంఈలకు చేయూత కోసం రూ.3 లక్షల కోట్ల రుణాలు లభించినట్లు చెప్పారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లోని 19 ఇంజినీరింగ్ కళాశాలల్లో 6 స్థానిక భాషల్లో బోధన కొనసాగుతోందన్నారు. క్రీడారంగ బలోపేతానికి వివిధ పథకాలు, సౌకర్యాలు కల్పించామని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన ద్వారా రోజుకు 100 కి.మీ. రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. భారత్‌మాల కింద రూ.6 లక్షల కోట్లతో 20 వేల కి.మీ. మేర ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణం జరిగిందన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఆలయ ప్రస్తావన

ఇక బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రసంగించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తెలంగాణ ఆలయ ప్రస్తావనను తీసుకువచ్చారు. రామప్ప ఆలయం గురించి మాట్లాడారు. రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకొచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు.

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగం కోసం ఈ కింది వీడియోను చూడండి

ఇవి కూడా చదవండి:

Budget 2022: దేశాభివృద్దికి ఇదే కీలక సమయం.. ప్రతిపక్షాలు సహకరించాలి.. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ

Financial Calender: ముఖ్యమైన పనులు చేసుకునేందుకు ఈ నాలుగు తేదీలను గుర్తించుకోండి.. లేకపోతే ఇబ్బందులు పడతారు..!