Budget 2022: దేశాభివృద్దికి ఇదే కీలక సమయం.. ప్రతిపక్షాలు సహకరించాలి.. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ

Budget 2022: ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 2022-23 బడ్జెట్‌..

Budget 2022: దేశాభివృద్దికి ఇదే కీలక సమయం.. ప్రతిపక్షాలు సహకరించాలి.. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ
Follow us
Subhash Goud

|

Updated on: Jan 31, 2022 | 11:03 AM

Budget 2022: ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 2022-23 బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు కరోనా ప్రతికూల పరిస్థితులు, ఇటు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యలో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక సోమవారం నుంచి పార్లమెంట్‌ సమాశాలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్‌ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ (Budget 2022) సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు సహకరించాలని మోడీ కోరారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఎంపీలందరికి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. దేశాభివృద్దికి కీలక సమయమని, ప్రపంచ ఆర్థిక పరిస్థితిలో భారత్‌కు చాలా అవకాశాలున్నాయని అన్నారు. మేడ్‌ ఇన్‌ ఇండియా వ్యాక్సిన్లు ప్రపంచానికి విశ్వాసాన్ని కలిగిస్తుందని,చర్చలకు విపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.

అయితే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Minister Nirmala Sitharaman) పేపర్‌లెస్ యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రవేశ పెడుతారు. ఇంతకుముందు, 2021-22లో మొదటిసారి పేపర్‌లెస్ యూనియన్ బడ్జెట్‌ను సమర్పించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈసారి ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది.

ఈరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కూడా ఈరోజు సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రి 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పిస్తారు.

ఇవి కూడా చదవండి:

Budget2022: వ్యవసాయ రంగానికి గతేడాది బడ్జెట్ కేటాయింపు ఎంత? అప్పటి ప్రతిపాదనలు ఏమిటి? తెలుసుకుందాం..

Budget 2022: బంగారం ప్రియుల‌కు అదిరిపోయే వార్త‌.. కోటి ఆశ‌ల కొత్త బ‌డ్జెట్ చెబుతోన్న తీపి క‌బురు..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..