బాబు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు-వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌ కు జరిగిన అన్యాయంపై చంద్రబాబు చేస్తున్న దీక్షపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రాజమండ్రిలో జరిగిన బీసీ గర్జన సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో  మాట్లాడుతూ, ఢిల్లీలో చంద్రబాబు చేస్తుంది దొంగ దీక్ష.. కొంగదీక్ష అని వ్యాఖ్యానించారు. ధర్మపోరాటం పేరుతో ఆరునెలలుగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఏనాడు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రాన్ని […]

బాబు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు-వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌ కు జరిగిన అన్యాయంపై చంద్రబాబు చేస్తున్న దీక్షపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రాజమండ్రిలో జరిగిన బీసీ గర్జన సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో  మాట్లాడుతూ, ఢిల్లీలో చంద్రబాబు చేస్తుంది దొంగ దీక్ష.. కొంగదీక్ష అని వ్యాఖ్యానించారు. ధర్మపోరాటం పేరుతో ఆరునెలలుగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఏనాడు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ మద్దతు కోరుతున్నారని విమర్శించారు. ఏలూరులో ఈనెల 17న జరిగే బీసీ గర్జన సభలో పార్టీ అధ్యక్షుడు జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని అన్నారు. బీసీలకు వైసీపీ ఏ విధంగా న్యాయం చేస్తుందో వివరించడానికే ఏలూరులో బీసీ గర్జన సభ ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.

Published On - 8:43 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu