రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలు
తిరుమల క్షేత్రం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. భక్తుల కోసం గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీ సౌకర్యాలు కల్పించింది. లక్షమందికి పైగా భక్తులు మాడవీధుల్లోని గ్యాలరీల్లో కూర్చుని వాహనసేవలను తిలకించేలా ఏర్పాట్లు చేపట్టారు. ఏటా మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి రోజున రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా మంగళవారం నాడు శ్రీవారు ఏడు ప్రధాన వాహనాల్లో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. వేకువజామునే సుప్రభాత ఆరాధన పూర్తయిన అనంతరం మలయప్పస్వామి ఆలయం నుంచి వాహనమండపానికి వేంచేస్తారు. […]

తిరుమల క్షేత్రం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. భక్తుల కోసం గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీ సౌకర్యాలు కల్పించింది. లక్షమందికి పైగా భక్తులు మాడవీధుల్లోని గ్యాలరీల్లో కూర్చుని వాహనసేవలను తిలకించేలా ఏర్పాట్లు చేపట్టారు. ఏటా మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి రోజున రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా మంగళవారం నాడు శ్రీవారు ఏడు ప్రధాన వాహనాల్లో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.

వేకువజామునే సుప్రభాత ఆరాధన పూర్తయిన అనంతరం మలయప్పస్వామి ఆలయం నుంచి వాహనమండపానికి వేంచేస్తారు. అక్కడ సూర్యప్రభ వాహనంపై ఆవీనులై ఊరేగింపుగా బయలుదేరుతారు. 5.30-8 గంటల మధ్య మాడవీధుల్లో వాయువ్య దిక్కుకు చేరుకుని సూర్యకిరణాల రాకకోసం వేచి ఉంటారు. ఉదయం భానుడి కిరణాలు సూర్యప్రభలో ఆశీనులైన స్వామివారి పాదాలను తాకగానే సప్తవాహన వేడుకలు ప్రారంభమవుతాయి. వరుసగా 9-10 గంటల మధ్య చిన్నశేష, 11-12 గంటల మధ్య గరుడ, మధ్యాహ్నం 1-2 నడుమ హనుమంత వాహనసేవలు, 2-3 మధ్య చక్రస్నానం, తిరిగి సాయంత్రం 4-5 గంటల నడుమ కల్పవృక్ష, 6-7 మధ్య సర్వభూపాల, రాత్రి 8-9 గంటల మధ్య చంద్రప్రభ వాహనాలపై స్వామి వారు ఊరేగనున్నారు. రథసప్తమి సందర్భంగా రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలును రద్దు టీటీడీ రద్దు చేసింది.