హరీశ్‌రావు సతీమణి సంచలన నిర్ణయం!

రాజకీయాల్లోకి హరీశ్‌రావు సతీమణి భర్త నియోజకర్గం నుంచే పోటీ హరీశ్ పట్ల ప్రత్యేక ప్లాన్ వేసుకున్న కేసీఆర్ చక్రం తిప్పబోతున్న తెలంగాణ సీఎం హైదరాబాద్: రాజకీయాల్లోకి హరీశ్‌రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఇప్పుడిదే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రమ్యారావు మేనత్త కొడుకుల్లో హరీశ్‌రావు ఒకరు అందుకు కారణం టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్. రమ్యారావు. ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా తెలంగాణ అనే వాట్సప్ గ్రూప్‌లో ఆసక్తికరమైన పోస్టింగ్ […]

హరీశ్‌రావు సతీమణి సంచలన నిర్ణయం!
  • రాజకీయాల్లోకి హరీశ్‌రావు సతీమణి
  • భర్త నియోజకర్గం నుంచే పోటీ
  • హరీశ్ పట్ల ప్రత్యేక ప్లాన్ వేసుకున్న కేసీఆర్
  • చక్రం తిప్పబోతున్న తెలంగాణ సీఎం
హైదరాబాద్: రాజకీయాల్లోకి హరీశ్‌రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఇప్పుడిదే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రమ్యారావు మేనత్త కొడుకుల్లో హరీశ్‌రావు ఒకరు
అందుకు కారణం టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్. రమ్యారావు. ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా తెలంగాణ అనే వాట్సప్ గ్రూప్‌లో ఆసక్తికరమైన పోస్టింగ్ చేశారు. అందులో త్వరలో మరో నాలుగు నెలల్లో సిద్ధిపేటకు బై ఎలక్షన్. ఆ స్థానం నుంచి పోటీ చేయనున్న తన్నీరు శ్రీనిత అని ఆమె పోస్ట్ చేశారు. దీంతో అది అక్కడి నుంచి బాగా వైరల్‌గా మారింది.
రమ్యారావు మేనత్త కొడుకుల్లో హరీశ్‌రావు ఒకరు. అందువల్లనే ఆమె వాట్సప్‌లో చేసిన పోస్టింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకుని, అది కాస్తా వైరల్‌గా మారింది. అదేమిటి అల్రెడీ అక్కడ హరీశ్‌రావు ఎమ్మెల్యేగా చేస్తున్నారుగా? అంటారా.. కరెక్టే కానీ హరీశ్‌రావును ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని కూడా వినిపిస్తోంది.
జాతీయ రాజకీయాల్లో పట్టు కోసమే!
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పట్టు సాధించాలని ప్రయత్నిస్తోన్నారు. థర్డ్ ఫ్రంట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరీశ్‌రావును పట్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సిద్ధిపేట నియోజకవర్గానికి హరీశ్‌రావుతో రాజీనామా చేయించి ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌కు బలమైన వాయిస్ ఉండేలా చూసుకోవాలేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.
రమ్యారావు అభిప్రాయం నిజమేనా?
కేసీఆర్ వ్యూహానికి అనుగుణంగా హరీశ్‌రావు సిద్ధిపేటకు రాజీనామా చేయనున్నారు. అటుపై జరగనున్న బైఎలక్షన్‌లో తన్నీరు శ్రీనిత టీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తారట. దీంతో ఎన్నో ఏళ్లుగా సిద్ధిపేటను చూసుకుంటూ వచ్చిన హరీశ్‌రావు ఇప్పుడు ఆ బాధ్యతలను సతీమణి శ్రీనితకు అప్పగించడమే తప్పనిసరి కానుందన్నమాట. అయితే రమ్యారావు వాట్సప్‌లో వ్యక్తం చేసిన అభిప్రాయం వాస్తవమేనా? నిజంగా అలానే జరుగుతుందా? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Published On - 8:57 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu