జగన్ ఒకటో రెండో సీట్లు గెలిస్తే: చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ పట్ల కేంద్రం తీరుకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బాబు దీక్షకు పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్, శరద్ పవార్, మాయావతి వంటి నాయకులు  సంఘీభావం తెలిపారు. అయితే ఈ క్రమంలో చంద్రబాబు ఒక జాతీయ మీడియాతో మాట్లాడారు.  వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం […]

జగన్ ఒకటో రెండో సీట్లు గెలిస్తే: చంద్రబాబు
హైదరాబాద్: ఏపీ పట్ల కేంద్రం తీరుకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బాబు దీక్షకు పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్, శరద్ పవార్, మాయావతి వంటి నాయకులు  సంఘీభావం తెలిపారు.
అయితే ఈ క్రమంలో చంద్రబాబు ఒక జాతీయ మీడియాతో మాట్లాడారు.  వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం తమతో కలిసి రావాలని అన్నారు. టీడీపీ చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు వైసీపీ మీతో కలిసిరావాలని ఎందుకు అడుగుతున్నారని రిపోర్టర్ చంద్రబాబును ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఎన్నికల తర్వాత అయినాసరే వైసీపీ ఒకటో రెండో సీట్లు గెలుచుకుంటే తమకు మద్దతివ్వాలని, అందులో తప్పు లేదని అన్నారు.

Published On - 9:07 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu