మోదీకి ఓటేయండి.. అదే మాకు పెళ్లి కానుక

హైదరాబాద్: ‘‘రానున్న లోక్‌సభ ఎన్నికలలో మోదీకి ఓటేయండి.. అదే మీరు మాకు ఇచ్చే పెళ్లి కానుక’’ అంటూ వినూత్నంగా వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించాడు కాబోయే పెళ్లికొడుకు. హైదరాబాద్‌లోకి శంషాబాద్‌కు చెందిన యండె సుభాష్ రావు నాలుగో కుమారుడు ముఖేశ్ వివాహం ఈ నెల 21న జరగనుంది. ఈ సందర్భంగా అచ్చు వేయించిన ఆహ్వానపత్రికల్లో మోదీకి ఓటేయమని అచ్చు వేయించి తన అభిమానాన్ని చాటుకొన్నాడు. మోదీ అంటే తనకు ఎంతో గౌరవమని.. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఎన్నో […]

మోదీకి ఓటేయండి.. అదే మాకు పెళ్లి కానుక
హైదరాబాద్: ‘‘రానున్న లోక్‌సభ ఎన్నికలలో మోదీకి ఓటేయండి.. అదే మీరు మాకు ఇచ్చే పెళ్లి కానుక’’ అంటూ వినూత్నంగా వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించాడు కాబోయే పెళ్లికొడుకు. హైదరాబాద్‌లోకి శంషాబాద్‌కు చెందిన యండె సుభాష్ రావు నాలుగో కుమారుడు ముఖేశ్ వివాహం ఈ నెల 21న జరగనుంది. ఈ సందర్భంగా అచ్చు వేయించిన ఆహ్వానపత్రికల్లో మోదీకి ఓటేయమని అచ్చు వేయించి తన అభిమానాన్ని చాటుకొన్నాడు. మోదీ అంటే తనకు ఎంతో గౌరవమని.. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని ముఖేశ్ ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా ఇటీవల గుజరాత్‌లో కూడా ‘ఓటు ఫర్ మోదీ’ అంటూ ఓ జంట తమ వివాహ పత్రికపై ముద్రించిన విషయం తెలిసిందే.

Published On - 11:58 am, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu