కలిసొచ్చిన ఫాంహౌజ్
తెలంగాణ సీఎం కేసీఆర్ కి తన ఫాంహౌజ్ అంటే సెంటిమెంట్ అని చాలా సందర్బాల్లో చెప్పారు. ఏ విషయంపైనానే ఇక్కడే చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఏ పనినైనా ఇక్కడి నుంచి మొదలుపెడితే అది విజయవంతమవుతుందని ఆయన నమ్మిక. ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తన ఫౌంహౌజ్ కు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే.. క్యాబినేట్ విస్తరణపై త్వరలోనే ప్రకటిస్తా అని చెప్పిన వెంటనే ఆయన ఇక్కడికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడే ఆయన […]

తెలంగాణ సీఎం కేసీఆర్ కి తన ఫాంహౌజ్ అంటే సెంటిమెంట్ అని చాలా సందర్బాల్లో చెప్పారు. ఏ విషయంపైనానే ఇక్కడే చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఏ పనినైనా ఇక్కడి నుంచి మొదలుపెడితే అది విజయవంతమవుతుందని ఆయన నమ్మిక. ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తన ఫౌంహౌజ్ కు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే.. క్యాబినేట్ విస్తరణపై త్వరలోనే ప్రకటిస్తా అని చెప్పిన వెంటనే ఆయన ఇక్కడికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడే ఆయన ఏకాంతంగా ఆలోచించి ముందడుగు తీసుకుంటారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాగా.. ఈ నెల 17న తన పుట్టిన రోజున ప్రకటిస్తారా..? లేదా ముందు రోజే మంత్రి వర్గ విస్తరణను ప్రకటిస్తారా..? అనేది తేలాల్సి ఉంది.



