AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vehicle Registration: వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌..?

నూతనంగా వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. ఇకపై కొత్త వాహనం కొన్న తర్వాత వాహన రిజిస్ట్రేషన్‌ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన పనిలేకుండా.. షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే విధంగా అక్కడే ఏర్పాటలను చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ప్రక్రియ అమల్లోకి వస్తే ప్రజలకు ప్రజలకు సమయంతో పాటు డబ్బు ఆదాకానుంది.

Vehicle Registration: వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌..?
Vehicle Registration Telangana
Anand T
| Edited By: |

Updated on: Jan 05, 2026 | 8:07 PM

Share

ప్రజలకు మెరుగైన సేవలను అందించే లక్ష్యంలో రవాణా శాఖలో మరో కొత్త సంస్కరణను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతుంది. గతంలో మనం కొత్త వాహనం ఏదైనా తీసుకుంటే.. దాన్ని రిజిస్ట్రేషన్‌ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ తీసుకురాబోయే ఈ సంస్కరణతో.. మనం వాహనం ఎక్కడైతే కొనుగోలు చేస్తామో.. ఆ షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా రవాణా శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది.

ప్రతి సవంత్సరం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 6.03 లక్షల ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌లు జరుగుతుందగా.. 1.75 లక్షల వరకు కొత్త కార్ల రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి. ఇప్పడు మనం కొత్త వాహనం కొంటే షోరూం వాళ్లు మనకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఇస్తారు. ఆ తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం మనం మళ్లీ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత నెంబర్ ప్లేట్‌ కోసం మళ్లీ డీలర్‌ దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. అందుకే వాహనం కొనుగోలు చేసిన దగ్గరే అన్ని ప్రక్రియలు పూర్తయ్యే విధంగా ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న ప్రక్రియ

అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ పరిధిలోని ‘వాహన్, సారథి’ పోర్టళ్లలో చేరి నేరుగా షోరూంలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో “సారథి” పోర్టల్‌ అమలులో ఉన్నప్పటికి “వాహన్” పోర్టల్‌ను మాత్రం పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. అయితే ఇటీవలే “వాహన్” ను త్వరగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి పొన్న ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే జరిగే మార్పులు

తెలంగాణలో ఈ ప్రక్రియ అమల్లోకి వస్తే.. వాహనం కొనుగోలు చేసినప్పుడే కొనుగోలుదారుడి వివరాల్ని డీలర్‌ వాహన సారథి పోర్టల్‌లో ఎంటర్ చేస్తారు. దీనికి రవాణాశాఖ అధికారి డిజిటల్‌ అప్రూవల్‌ ఇవ్వగానే మీ వాహనం రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఒక వేళ మీకు సాధారణ నెంబర్ కావాలనుకుంటే ఆరోజు సాయంత్రంలోపు లేదా మరుసటి రోజు ఉదయం వరకు మీకు రిజిస్ట్రేషన్ పూర్తై నెంబర్ ప్లేట్ వచ్చేస్తుంది. అదే “ఫ్యాన్సీ” నెంబర్ కావాలంటే రవాణా శాఖ కొత్త నెంబర్ సిరీస్‌లు విడుదల చేసేంత వరకు మీరు వేచి ఉండాల్సి వస్తోంది. ఒక వేళ మీరు కమర్సియల్ పర్పస్‌గా వాహనం కొనుగోలు చేస్తున్నట్లయితే దాని రిజిస్ట్రేషన్ కోసం మీరు ఆర్డీవో ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.