Weather: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ.. రాత్రి వేళల్లో చలి పెరుగుతోంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది వచ్చే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని పేర్కొంది..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ.. రాత్రి వేళల్లో చలి పెరుగుతోంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది వచ్చే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు-భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంలో ఉన్న తీవ్ర అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయం 0830 గంటలకు (జనవరి 6, 2026) అదే ప్రాంతంలో కొనసాగుతుంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత, తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశము ఉంది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దిగువ ట్రోపో ఆవరణములో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ వాతావరణ పరిస్థితులు:-
మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
దట్టమైన పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.
గమనిక :- రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం , రాయలసీమ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు .
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు:
తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు, ఈశాన్య దిశల నుండి వీస్తున్నాయి.. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు :
మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
