భరతమాత వేషంలో ఉన్న ఈమె ఎవరు..?

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రధాని మోడీ మోసం చేశారని, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. అయితే.. ధర్మపోరాట దీక్షలో తెలుగు తల్లి వేషంలో కనిపించి అందర్నీ ఆశ్చర్యం చేశారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ. ‘నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం’అనే స్లోగన్ ఉన్న ప్లకార్డుతో వేదికపై అటూ ఇటూ తిరుగుతూ ప్రదర్శించారు. తన పెద్ద కుమారుడు చంద్రబాబు […]

భరతమాత వేషంలో ఉన్న ఈమె ఎవరు..?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:25 PM

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రధాని మోడీ మోసం చేశారని, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. అయితే.. ధర్మపోరాట దీక్షలో తెలుగు తల్లి వేషంలో కనిపించి అందర్నీ ఆశ్చర్యం చేశారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ. ‘నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం’అనే స్లోగన్ ఉన్న ప్లకార్డుతో వేదికపై అటూ ఇటూ తిరుగుతూ ప్రదర్శించారు. తన పెద్ద కుమారుడు చంద్రబాబు నాయుుడు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అలుపెరగని దీక్షలు చేస్తుంటే.. నా రెండో కుమారుడు జగన్ మాత్రం మోడీకి మద్దతు తెలుపుతూ, చేతులు కలుపుతున్నారని విమర్శించారు యామినీ శర్మ. తన కుమారుడు జగన్ దారి తప్పుతున్నాడని.. అతన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రజలకే ఉందని అన్నారు. తెలుగు తల్లిని ప్రతిబింబించేలా ఉన్న యామినీని పలువురు టీడీపీ నేతలు ప్రశంసించారు.