మహేశ్ హత్యకేసులో ఇద్దరి అరెస్టు!
బెజవాడ కాల్పుల కేసును పోలీసుల ఛేదించారు. పోలీసు కమిషనరేట్ ఉద్యోగిని కాల్చి చంపిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే మహేశ్ హత్యకు కారణాలేంటో తేటతెల్లమవుతాయని పోలీసులు భావిస్తున్నారు.
Two persons arrested in Mahesh murder case: విజయవాడ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్‌పై నాలుగు రోజుల క్రితం జరిగిన కాల్పుల వ్యవహారంలో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. కాల్పులకు తెగబడిన ఇద్దరు వ్యక్తుల ఆచూకీ రాబట్టారు. మహేశ్ మీద కాల్పులు జరిపి పారిపోయిన ఇద్దరు వ్యక్తులను గోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తీసుకువచ్చేందుకు బెజవాడ పోలీసులు గోవాకు బయలుదేరారు.
సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్ హత్య కేసులో కీలక పరిణామం బుధవారం చోటుచేసుకుంది. మహేశ్ మీద కాల్పులు జరిపి హత్య చేసిన ఇద్దరు నిందితులను గోవా లో పోలీసులు పట్టుకున్నారు. దాంతో వారిని తీసుకువచ్చేందుకు బెజవాడ పోలీసులు గోవాకు బయలుదేరారు. అయితే ఫ్లైట్ మిస్ అవటంతో ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు వెయిట్ చేస్తున్నారు.
ఓ మహిళకు సంబంధించిన వ్యవహారం వికటించడంతోనే మహేశ్ మీద కాల్పులకు దారి తీసిందని ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. సాత్విక్ రెడ్డినే ఇదంతా చేసినట్లుగా పోలీసులు అనధికారికంగా చెబుతున్నారు. ప్రస్తుతం గోవాలో అరెస్టు చేసిన ఇద్దరిని విచారిస్తే నిజానిజాలు వెలుగు చూస్తాయని వారు అంటున్నారు.
Also read: కుంగిన రోడ్డు.. ప్రమాదంలో మెట్రో పిల్లర్
Also read: రెండోతరం వాక్సిన్‌తోనే సాధారణ స్థితి
Also read: చంద్రబాబుకు ఛాన్సివ్వండి..హైకోర్టు ఆదేశం
Also read: అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ
Also read: నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు
Also read: కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ