AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షోపియన్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి

జమ్ముకశ్మీర్‌ షోపియన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

షోపియన్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి
Handwara encounter
Balaraju Goud
|

Updated on: Oct 14, 2020 | 5:02 PM

Share

జమ్ముకశ్మీర్‌ షోపియన్ జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పక్కా సమాచారం మేరకు షాపియాన్ జిల్లాలోని చకురా ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలను గమనించిన టెర్రరిస్టులు తప్పించుకునేందుకు యత్నించారు. ఇదే క్రమంలో భద్రత సిబ్బందిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి.

కాల్పులు ముగిసిన తర్వాత అక్కడ వెతగ్గా.. ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభించినట్లు భద్రతా దళాల ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, పారిపోయిన మరికొందరు ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో మరింత గాలింపు చర్యలు చేపట్టినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా దళాల సంయుక్త బృందం పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన వారి మృతదేహాలను ఇంకా ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. ఇక, మరణించిన ఉగ్రవాదులను ఎవరనేదీ గుర్తించాల్సి ఉంది.

Follow Us
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్