Breaking News
  • తిరుపతి : ఒకే ఇంట్లో ఒక రోజు వ్యవధిలో మామ, కోడలు ఆత్మహత్యకేసులో కొనసాగుతున్న పోలీస్ విచారణ. భర్త వేధింపులతో న కోడలు హరిత ఉరేసుకుని ఆత్మహత్య. కోడలి వేధింపులకు తామే కారణమని అందరూ అనడంతో అవమానంతో మామ రామిరెడ్డి ఆత్మహత్య. చిన్నగొట్టిగల్లు మండలం చిట్టెచెర్ల గ్రామంలో ఘటన. పెళ్లి అయిన ఆరు నెలలకే హరిత ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకున్న హరిత గర్భవతి. భర్త, అత్తమామ వేధింపులే కారణమని ఆమె తల్లి దండ్రుల ఆరోపణ..కేసు నమోదు. నిన్నటి నుంచి హరిత ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్న భర్త ఆనంద్ రెడ్డి,అతని తల్లి. హరిత ఆత్మహత్య పై గ్రామస్తులు నుంచి విమర్శలు ఎదుర్కోవడంతో అవమానంగా భావించి ఆత్మహత్య కు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు. ఇప్పటికీ పరారీలో ఉన్న హరిత భర్త ఆనంద్ రెడ్డి. తండ్రి, భార్య చనిపోయినా సరే మృతదేహాలు చూడటానికి కూడా రాని ఆనంద్ రెడ్డి. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న ఆనంద్ రెడ్డి. కరోనా కారణంగా గత ఏడు నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న ఆనంద్.
  • విజయవాడ : బీటెక్ విద్యార్థిని దివ్య పోస్టుమార్టం , ఫోరెన్సిక్ నివేదికలో కీలక విషయాలు. దివ్యది హత్యే ,గాయాలు సొంతంగా చేసుకున్నవి కావు. ఆత్మహత్య చేసుకోవాలని ఎవరికి వాళ్లం కత్తితో గాయాలు చేసుకున్నామన్న . నిందితుడు నాగేంద్ర వాదనలో నిజం లేదని నిగ్గు తేల్చిన నివేదికలు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించిన పోలీసులు. ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్న దిశా టీం . ఈ నెల 28వ తేదీన న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసే అవకాశం . ఆసుపత్రిలోనుంచి నాగేంద్ర డిశ్చార్జి కాగానే అదుపులోకి తీసుకోని విచారించనున్న పోలీసులు.
  • హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో సందడిగా ఉంటుందని, అయితే ప్రస్తుతం కరోనా ‌మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు ఎమ్మెల్సీ కవిత. కానీ, " ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూ ట్యూబ్ లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం" అని ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు.
  • టీవీ9 నిఘా ఎఫెక్ట్: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై వరుస కథనాలు ప్రసారం చేసిన టీవీ9. తెలంగాణ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ పై నిన్న రాత్రి,ఈరోజు ఉదయం దాడులు నిర్వహించారు. రాత్రి హైదరాబాద్ నుంచి ఏపీ కి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఖైరతాబాద్ లో తనిఖీలు చేసిన ఆర్టీఏ అధికారులు. ఈ రోజు ఉదయం పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఏపీ నుండి హైదరాబాద్ కి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేసిన అధికారులు. ఆర్టిఏ లోని విజిలెన్స్ విభాగంలోని 6గురు వెహికల్ ఇన్స్పెక్టర్ లు 20 మంది సిబ్బంది తో కలిసి తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల కు సంబంధించి ఫిట్నెస్,టాక్స్,పర్మిట్ లను తనిఖీ చేసిన అధికారులు. నిబంధనలు పాటించకుండా, టాక్స్ లు కట్టకుండా బస్సులు రోడ్డు పై తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటాము అన్నారు ఆర్టీఏ అధికారులు. రాత్రి,ఉదయం 6 వందల వరకు ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేసిన ఆర్టీఏ అధికారులు. ప్రైవేట్ ట్రావెల్స్ లకు సంబంధించి టికెట్ చార్జిలకు ఫిక్స్డ్ రేటు అనేది లేదంటున్న ఆర్టీఏ అధికారులు. ఆర్టీఏ రూల్స్ ను క్యాష్ చేసుకొని ప్రయాణికుల డిమాండ్ బట్టి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్.
  • చెన్నై : అభిమానసంఘాల నేతలతో నటుడు విజయ్ కీలక భేటీ . దక్షిణ తమిళనాడు లోని మదురై , దిండిగల్, తిరునల్వేలి తో సహా పలు జిల్లా అధ్యక్షులతో కీలక భేటీ . 2021 లో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం లో కీలకం గా మారిన అభిమానసంఘాల నేతలతో భేటీ. ఈ ఎన్నికలలో నటుడు విజయ్ ఎవరికీ మద్దతిస్తాడని తమిళ రాజకీయాలలో కీలకంగా మారిన చర్చ .
  • తిరుమల: టీటీడీ ఈఓ జవహార్ రెడ్డి. రెండు మూడు రోజుల్లో దర్శనాల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. శ్రీవారిని నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాం. వాహన సేవలను ఏకాంతంగా చేసినప్పటికీ కైంకర్యాలను ఘనంగా నిర్వహించాం. టీటీడీ ఈఓ జవహార్ రెడ్డి.
  • గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కి కరోనా పాజిటివ్.. శనివారం నిర్వహించిన పరీక్షలలో నిర్ధారణ, 14 రోజుల హోమ్ క్వరంటీన్ లో ఉండాలని వైద్యుల సూచన.

కుంగిన రోడ్డు.. ప్రమాదంలో మెట్రో పిల్లర్

అసాధారణ స్థాయిలో హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు ఇపుడు మెట్రో రైలుకు ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్ మార్గానికి హానికరంగా...

Danger for Hyderabad Metrorail, కుంగిన రోడ్డు.. ప్రమాదంలో మెట్రో పిల్లర్

Danger for Hyderabad Metrorail: అసాధారణ స్థాయిలో హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు ఇపుడు మెట్రో రైలుకు ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్ మార్గానికి హానికరంగా మారాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో నగరంలోని పలు రోడ్లు తెగిపోయాయి.. పలు చోట్ల రోడ్లు కుంగిపోయాయి. దాంతో మెట్రో మార్గాలకు ప్రమాదం పొంచి వుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మియాపూర్-ఎల్బీనగర్ మెట్రో మార్గంలో మూసాపేట స్టేషన్ వద్ద మెట్రో పిల్లర్‌ను ఆనుకుని వున్న రోడ్డు కుంగిపోయింది. సరిగ్గా పిల్లర్‌కు చుట్టూ వున్న రోడ్డు కుంగిపోవడంతో దాని ప్రభావం పిల్లర్‌పై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక పిల్లర్ చుట్టూ రోడ్డు కుంగిపోగా.. దాని పక్కనే వున్న మరో పిల్లర్ చుట్టూ కూడా సగం వరకు రోడ్డు కుంగిపోయింది. చుట్టూ రోడ్డు కుంగిన నేపథ్యంలో పిల్లర్ పటుత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Danger for Hyderabad Metrorail, కుంగిన రోడ్డు.. ప్రమాదంలో మెట్రో పిల్లర్

అయితే, రోడ్డు కుంగిన విషయం తెలియని మెట్రో రైల్ అధికారులు మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లను నడుపుతూనే వున్నారు. నగరంలో రోడ్డు రవాణా వ్యవస్థ పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో మెట్రో రైలుపై ఆధారపడే ప్రయాణికుల సంఖ్య అధికంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లర్ కుంగిన విషయాన్ని పలువురు మెట్రో అధికారులకు తెలియ జేశారు. ప్రస్తుతం పిల్లర్ చుట్టూ వున్న నీటిని తోడేసిన అధికారులు.. మరోసారి భారీ వర్షం వస్తే ఏంటన్నది ఇపుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే మెట్రో ఇంజనీర్లు ప్రస్తుతం మూసాపేట దగ్గర పరిస్థితిని పరిశీలిస్తున్నారని, దగ్గరలోని చెరువు కట్ట తెగడం వల్లనే రోడ్డు కుంగిందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇంజనీర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన ఓ ప్రకటనలో తెలియజేశారు.

Also read: రెండోతరం వాక్సిన్‌తోనే సాధారణ స్థితి

Also read: చంద్రబాబుకు ఛాన్సివ్వండి..హైకోర్టు ఆదేశం

Also read: అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ

Also read: నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు

Also read: కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ

Related Tags