Breaking News
  • ఢిల్లీ: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. కోవిడ్‌ విజృంభణ తర్వాత ఏడోసారి ప్రధాని మోదీ ప్రసంగం. దేశంలో మరణాల రేటు తక్కువగా ఉంది. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగిద్దాం-ప్రధాని మోదీ. కరోనాను ఎదుర్కోవడంతో అగ్రదేశాల కంటే భారత్‌ మెరుగ్గా ఉంది. 10 లక్షల కేసుల్లో 83 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది-మోదీ. ఏ మాత్రం ఆదమరిచినా ఇబ్బందులు తప్పవు-మోదీ. 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకింది. కరోనాపై పూర్తి విజయం సాధించే వరకు పోరాటం ఆపొద్దు. కరోనా పరీక్షల కోసం 2 వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది సేవా భావంతో పనిచేస్తున్నారు. భౌతిక దూరం పాటించండి.. మాస్కులు ధరించండి-మోదీ. మీరు.. మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలి-ప్రధాని మోదీ. త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుంది-మోదీ.
  • విజయవాడ: సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్‌ హత్య కేసు. మహేష్‌ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌. పదో తేదీ రాత్రి 10 గంటలకు మహేష్‌ను కాల్చి చంపారు. కేసులో కీలక ఆధారాలు లభించాయి. గన్‌కు సంబంధించిన వివరాలు సేకరించాం. సాకేత్‌రెడ్డి, గంగాధర్‌ కలిసి మహేష్‌ హత్య చేశారు. సాకేత్‌ లాక్‌డౌన్‌లో గయ వెళ్లి గన్‌ను కొనుగోలు చేశాడు. -విజయవాడ సీపీ శ్రీనివాసులు. బాలుడిని కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేద్దామని సందీప్‌ స్కెచ్‌. సందీప్‌ను హైదరాబాద్‌ నుంచి సాకేత్‌ పిలిపించాడు.
  • ఏపీలో కొత్తగా 3,503 కరోనా కేసులు, 28 మంది మృతి. ఏపీలో మొత్తం 7,89,553 కేసులు, 6,481 మంది మృతి. ఏపీలో 33,396 యాక్టివ్‌ కేసులు, 7,49,676 మంది డిశ్చార్జ్‌.
  • విజయవాడ: ఈ రోజు 11,981 మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ రోజు సా.6 గంటల వరకు రూ.14,54,345 ఆదాయం వచ్చింది. రేపు 13 వేల మందికి అమ్మవారి దర్శనం కల్పిస్తాం. రేపు తె.3 గంటల నుంచి రా.9 గంటల వరకు దర్శనాలు. రేపు మ.3 గంటలకు అమ్మవారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. -దుర్గగుడి ఈవో సురేష్‌బాబు.
  • హైదరాబాద్‌ ముంపు సమస్యమీద విస్తృతమైన చర్చ జరగాలి. టీవీ9 ఓ వెబినార్‌ పెడితే అందరి అభిప్రాయాలు తెలుస్తాయి. హైదరాబాద్‌లో ఎన్డీఎంఏ రిపోర్ట్‌ ఎందుకు అమలు కావడం లేదు. ఫిరంగినాలా ఆక్రమణే పాతబస్తీ మునిగేందుకు కారణం. -బిగ్‌ డిబేట్‌లో పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి.
  • తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించాలని సీఎం జగన్‌కు ఆహ్వానం. సీఎంను ఆహ్వానించిన మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు.
  • శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత. ఇన్‌ఫ్లో 3,26,466 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,03,188 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు. ప్రస్తుత నీటినిల్వ 211 టీఎంసీలు.

చంద్రబాబుకు ఛాన్సివ్వండి..హైకోర్టు ఆదేశం

అమరావతి హైకోర్టు విపక్ష నేత చంద్రబాబుకు అనుకూలంగా మరోసారి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ కమిషన్ సభ్యత్వం విషయంలో చంద్రబాబు పిటిషన్‌పై సానుకూలంగా స్పందించింది.

SSC berth for Chandrababu, చంద్రబాబుకు ఛాన్సివ్వండి..హైకోర్టు ఆదేశం

SSC berth for Chandrababu: స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబుకు అవకాశమివ్వాలంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం.

స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబు లేకపోవడంపై దాఖలైన పిటిషన్‌పై అమరావతి హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తక్షణం ప్రతిపక్ష నేత చంద్రబాబు పేరును నమోదు చేస్తూ నెల రోజుల్లో జీవో ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. ప్రతిపక్ష నేత పేరు స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో లేకపోవడం సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

Also read: అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ

Also read: నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు

Also read: కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ

Related Tags