రెండోతరం వాక్సిన్‌తోనే సాధారణ స్థితి

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్సిన్ రావడంతోనే సాధారణ స్థితి వచ్చేస్తుందని ఆశపడుతున్న వారిలో నిరుత్సాహం మిగిల్చారు.

రెండోతరం వాక్సిన్‌తోనే సాధారణ స్థితి
Follow us

|

Updated on: Oct 14, 2020 | 3:19 PM

Second generation vaccine only brings normalcy: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్సిన్ రావడంతోనే సాధారణ స్థితి వచ్చేస్తుందని ఆశపడుతున్న వారిలో నిరుత్సాహం మిగిల్చారు. వాక్సిన్ రాగానే సాధారణ స్థితి రాదని గేట్స్ అభిప్రాయపడ్డారు.

కరోనాపై పోరాటంలో తొలి తరం వాక్సిన్లతో ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొవని బిల్ గేట్స్ అంటున్నారు. మొదటి తరం వాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడే అవకాశం వుంటుందని ఆయనంటున్నారు. చాలా వరకు క్లినికల్ ట్రయల్స్‌లో సక్సెస్‌గానే కనిపిస్తుందని, కానీ రియల్ వినియోగంలోకి వచ్చే సరికి కొన్నైనా సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే ప్రమాదం వుంటుందని గేట్స్ అంఛనా వేస్తున్నారు.

అయితే, తొలి తరం వాక్సిన్‌ను ఇంప్రూవ్ చేసిన తర్వాత వచ్చే రెండో తరం వాక్సిన్‌తో ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని బిల్ గేట్స్ అంఛనా వేస్తున్నారు. తొలి తరంలో తలెత్తే సమస్యలను అధిగమించిన తర్వాత తయారయ్యే రెండో తరం వాక్సిన్ మరింత ప్రభావవంతంగా పని చేస్తుందని, దాంతో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు మెరుగుపడతాయని గేట్స్ అంటున్నారు.

Also read: చంద్రబాబుకు ఛాన్సివ్వండి..హైకోర్టు ఆదేశం

Also read: అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ

Also read: నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు

Also read: కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ