ఇదేం పెళ్లాం బాబోయ్.. ఇల్లు, ఒళ్లు శుభ్రంగా ఉంచదు.. విడాకులు ఇప్పించండి మహాప్రభో..

ఇంట్లో పరిశుభ్రతపై అంత శ్రద్ధ చూపని పెళ్లయిన జంటలు చాలా మంది ఉన్నాయి. అయితే ఈ శుభ్రత కారణంగా ఎవరైనా విడాకులు తీసుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును అలాంటి ఒక కేసు ప్రస్తుతం చాలా చర్చనీయాంశమైంది. ఇది ప్రజలను ఆలోచించేలా చేసింది. భార్య ఇంటిని శుభ్రం చేయలేదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు కనీసం ఆమె కూడా శుభ్రంగా ఉండదు. అపరిశుభ్రంగా జీవిస్తుంది. ఇల్లు కూడా పూర్తిగా మురికిగా ఉంది. దీని కారణంగా ఆమె భర్త ఇప్పుడు ఆమెకు విడాకులు ఇవ్వబోతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇంట్లో ఎంత అపరి శుభ్రంగా ఉన్నదో మీరు చూడవచ్చు

ఇదేం పెళ్లాం బాబోయ్.. ఇల్లు, ఒళ్లు శుభ్రంగా ఉంచదు.. విడాకులు ఇప్పించండి మహాప్రభో..
Dirty Woman
Follow us
Surya Kala

|

Updated on: Apr 10, 2024 | 10:03 AM

ప్రతి ఒక్కరూ నివసించే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. ఇంట్లోనే కాదు ఇంటి బయట కూడా శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా బ్యాచిలర్ అబ్బాయిలు, అమ్మాయిలు ఇంటి శుభ్రతపై పెద్దగా శ్రద్ధ చూపరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత కనిపిస్తుంది. అయితే ఇంట్లో పరిశుభ్రతపై అంత శ్రద్ధ చూపని పెళ్లయిన జంటలు చాలా మంది ఉన్నాయి. అయితే ఈ శుభ్రత కారణంగా ఎవరైనా విడాకులు తీసుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును అలాంటి ఒక కేసు ప్రస్తుతం చాలా చర్చనీయాంశమైంది. ఇది ప్రజలను ఆలోచించేలా చేసింది.

భార్య ఇంటిని శుభ్రం చేయలేదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు కనీసం ఆమె కూడా శుభ్రంగా ఉండదు. అపరిశుభ్రంగా జీవిస్తుంది. ఇల్లు కూడా పూర్తిగా మురికిగా ఉంది. దీని కారణంగా ఆమె భర్త ఇప్పుడు ఆమెకు విడాకులు ఇవ్వబోతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇంట్లో ఎంత అపరి శుభ్రంగా ఉన్నదో మీరు చూడవచ్చు. తనను ఇంటి నుండి బయటకు పంపవద్దని మహిళ తన భర్తను వేడుకుంది. ఆ మహిళ తన భర్త కాళ్లు పట్టుకుని తాను గర్భవతి అని కూడా ప్రస్తావించింది, అయితే భర్త అంగీకరించలేదు, విడాకుల కోసం పట్టుబట్టాడు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ ఈ వీడియో ఖచ్చితంగా టిక్‌టాక్ నుంచి ట్విట్టర్‌కు వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @instablog9ja IDతో భాగస్వామ్యం చేయబడింది. ఆమె ఇంటిని శుభ్రం చేయనందున ఆమె భర్త విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేస్తున్నాడు’ అనే శీర్షికతో ఉంది.

ఒక నిమిషం 4 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 2.9 మిలియన్లు అంటే 29 లక్షల సార్లు వీక్షించగా, 15 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు. ఈ వీడియో చూస్తుంటే.. ‘మహిళ గర్భిణి అయితే.. ఆమె క్లీనింగ్‌లో ఆమె భర్త తప్పనిసరిగా సహాయం చేయాలి’ అని ఎవరో చెబుతుండగా, ఈ వీడియో స్క్రిప్ట్‌లో ఉందని ఒకరు తన భార్యకు ఇంత చిన్న విషయానికి విడాకులు ఇవ్వలేరు అని కామెంట్ చేస్తున్నారు.

మరిన్నిట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..