రాఫెల్ విమానాలు ఉంటే… రఫ్ఫాడించే వాళ్లం : ప్రధాని మోదీ
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరుపడం పట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం మన వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల యావత్ దేశం బాధపడుతున్నదని అన్నారు. ఢిల్లీలో శనివారం ఆయన ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ.. భారత్ వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల యావత్తు దేశం ఆవేదన చెందుతున్నది. ఆ విమానాలు మన వద్ద ఉంటే ఫలితం మరోలా ఉండేది. ప్రస్తుతం దేశమంతా […]

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరుపడం పట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం మన వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల యావత్ దేశం బాధపడుతున్నదని అన్నారు. ఢిల్లీలో శనివారం ఆయన ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ.. భారత్ వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల యావత్తు దేశం ఆవేదన చెందుతున్నది. ఆ విమానాలు మన వద్ద ఉంటే ఫలితం మరోలా ఉండేది. ప్రస్తుతం దేశమంతా ముక్తకంఠంతో మాట్లాడుతున్న మాట ఇదే. రాఫెల్ విమానాల విషయమై గతంలోనూ ఇప్పుడు కొనసాగుతున్న స్వార్థ రాజకీయాల వల్ల దేశం చాలా నష్టపోయింది అని పేర్కొన్నారు.

తనను విమర్శించే స్వేచ్ఛ విపక్ష నేతలకు ఉన్నదని, అయితే ఆ విమర్శలు మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులకు ఉపయోగపడకూడదని ప్రధాని మోదీ అన్నారు. కొంత మంది వ్యక్తులు తమ సొంత దేశాన్నే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. మన దేశం ముందున్న పెద్ద సవాళ్లలో ఇదొకటని.. ఇప్పుడు మన దేశమంతా సాయుధ బలగాలకు అండగా నిలిచిందని అన్నారు. కానీ కొన్ని పార్టీలు మన సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను శంకిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పార్టీల ప్రకటనలు, వ్యాసాలను భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉపయోగించుకుంటున్నదని.. తనను విమర్శించే క్రమంలో ఈ పార్టీలు సొంత దేశాన్ని, దేశ ప్రయోజనాలను వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. మన సాయుధ బలగాలను విశ్వసిస్తారా లేక శంకిస్తారా అని ఈ పార్టీల నాయకులను నేను ప్రశ్నించదల్చుకున్నా. ప్రభుత్వ పనితీరులో లోపాలను ఎత్తిచూపుతూ మోదీని విమర్శించే స్వేచ్ఛ ఈ నాయకులకు ఉన్నది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారికి తోడ్పడకూడదని.. దేశ ప్రయోజనాలను వ్యతిరేకించకూడదంటూ ప్రధాని మోడీ ధ్వజమెత్తారు.



