AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతులారా పైలట్‌ను చంపుకొన్న పాకిస్థాన్

విధి ఎంత విచిత్రమైనదో అప్పుడప్పుడు కొన్ని జరుగుతున్న యధార్థ సంఘటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఘటన చూస్తే అలానే అనిపిస్తోంది. పారాచ్యూట్‌ ద్వారా పాక్‌ భూభాగంలో దిగిన ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌.. దాదాపు 60గంటల అనంతరం సురక్షితంగా పాక్‌ చెర నుంచి మాతృభూమిలో అడుగుపెట్టారు.దీంతో అభినందన్‌ కుటుంబంలోనే కాకా యావత్ భారతంలో హర్షాతిరేకాలు మిన్నంటాయి. మరి అదే పాక్‌ భూభాగంలోనే పారాచ్యూట్‌ సాయంతో దిగిన ఆ […]

చేతులారా పైలట్‌ను చంపుకొన్న పాకిస్థాన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 03, 2019 | 12:32 PM

Share

విధి ఎంత విచిత్రమైనదో అప్పుడప్పుడు కొన్ని జరుగుతున్న యధార్థ సంఘటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఘటన చూస్తే అలానే అనిపిస్తోంది. పారాచ్యూట్‌ ద్వారా పాక్‌ భూభాగంలో దిగిన ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌.. దాదాపు 60గంటల అనంతరం సురక్షితంగా పాక్‌ చెర నుంచి మాతృభూమిలో అడుగుపెట్టారు.దీంతో అభినందన్‌ కుటుంబంలోనే కాకా యావత్ భారతంలో హర్షాతిరేకాలు మిన్నంటాయి. మరి అదే పాక్‌ భూభాగంలోనే పారాచ్యూట్‌ సాయంతో దిగిన ఆ దేశ పైలట్‌ షాజుద్దీన్‌ ఇంకెంత సురక్షితంగా ఉంటాడనుకోవాలి? కానీ అలా జరగలేదు. భారత పైలట్‌ అనుకొని స్థానికులు అతడిని తీవ్రంగా కొట్టి చంపారు. బుధవారం ఎఫ్‌-16 యుద్ధ విమానంతో షాజుద్దీన్‌ భారత గగనతలంలోకి దూసుకొచ్చాడు. భారత యుద్ధ విమానమొకటి దాన్ని తరుముతూ కూల్చింది. దాన్ని నడుపుతున్న షాజుద్దీన్‌.. పారాచ్యూట్‌ సాయంతో పీవోకేలోని నౌషేరా సమీపంలోని లీమ్‌ లోయలో కాలుమోపాడు. అంతే షాజుద్దీన్‌ గాల్లోంచి దిగీ దిగగానే స్థానిక ప్రజలు కొందరు అతడిని చుట్టుముట్టారు.

పాకిస్థాన్‌ వాయుసేన యూనిఫాం ధరించి ఉన్నా కూడా.. అతడిని భారత్ కు చెందిన పైలట్‌గానే భ్రమించారు. అంతే.. అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెత్తురోడేలా చితగ్గొట్టారు. అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. షాజుద్దీన్‌ అక్కడ చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. అభినందన్‌ను మూక దాడి నుంచి రక్షించిన పాక్‌ ఆర్మీ అధికారులు.. తమ పైలట్‌ షాజుద్దీన్‌ను కాపాడుకోలేకపోయారు. అభినందన్‌ తండ్రి లాగే షాజుద్దీన్‌ తండ్రి వసీముద్దీన్‌ కూడా పాక్‌ వాయుసేనలో ఎయిర్‌ మార్షల్‌గా పనిచేయడం మరో విశేషం.

శత్రు దేశానికి చిక్కినా ప్రాణాలతో తిరిగొచ్చిన ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌కు యావత్‌ జాతి జేజేలు పలుకుతోంది. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్‌లో ఒక పైలట్‌ కుటుంబం తమ కొడుకు చేసిన త్యాగాన్ని బయటకు చెప్పుకోలేక, బడబాగ్నిలాంటి నిజాన్ని మనసులో దాచుకోనూలేక మౌనంగా రోదిస్తోంది. ఇద్దరూ పైలెట్లే. ఇద్దరి కుటుంబ నేపథ్యం ఒక్కటే. ఇద్దరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయే అల్లరిమూక చేతికి చిక్కారు. కానీ ఒకరి కథ సుఖాంతం కాగా మరొకరిది అంతులేని విషాదం.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్