హరితహారం మొక్కల్ని తిన్న మేకలు: యజమానికి రూ.500 ఫైన్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగా నర్సరీలను ఏర్పాటు చేసి పలు జాతుల మొక్కల్ని పెంచుతున్నారు. ఇదిలా ఉంటే హరితహారం కోసం నర్సరీల్లో పెంచిన మొక్కలను మేకలు తినేశాయి. దీంతో సదరు మేకల యజమానికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిధిలోని చిలుకూరులో జరిగింది. చిలుకూరు దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీలోకి మేకలు ప్రవేశించి ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు ఏపుగా ఎదిగిన […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగా నర్సరీలను ఏర్పాటు చేసి పలు జాతుల మొక్కల్ని పెంచుతున్నారు. ఇదిలా ఉంటే హరితహారం కోసం నర్సరీల్లో పెంచిన మొక్కలను మేకలు తినేశాయి. దీంతో సదరు మేకల యజమానికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిధిలోని చిలుకూరులో జరిగింది. చిలుకూరు దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీలోకి మేకలు ప్రవేశించి ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు ఏపుగా ఎదిగిన మొక్కల్ని మేసేశాయి. దీంతో మేకల యజమానికి చిలుకూరు పంచాయతీ కార్యదర్శి రూ. 500 జరిమానా విధించి వసూలు చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవ్వరైనా సరే హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను ధ్వంసం చేయాలని చూసినా, పీకేసినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.